సీఎం వైయ‌స్ జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తా

బాధ్యతలు చేపట్టిన మంత్రి సీదిరి అప్పలరాజు
 

అమరావతి : మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి  సీదిరి అప్పలరాజు తెలిపారు.  ఆదివారం ఉదయం మంత్రిగా అప్ప‌ల‌రాజు బాధ్యతలు స్వీకరించి, ఆక్వా కల్చర్‌ కొత్త అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 700 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని వివరించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో.. ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 

Back to Top