ఈ నెల 11 నుంచి జ‌గ‌న‌న్న‌ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ టోర్న‌మెంట్‌

పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేతలు
 

విజ‌య‌వాడ‌: రాష్ట్ర ముఖ్యమంత్రి, జననేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి  గారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నాయకులు  అవనాపు విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన దంపతుల సారధ్యంలో 11.12.2022(ఆదివారం) నుంచి 20.12.2022(మంగళవారం) వరకు నిర్వహించే జగనన్న ప్రీమియర్ లీగ్ (JPL) క్రికెట్ టోర్నీ పోస్టర్లను విజయవాడలో రాష్ట్ర పార్టీ నేతల చేతులమీదగా విడుదల చేశారు.  రాజ్యసభ సభ్యులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వి.విజయసాయి రెడ్డి, టీటీడీచైర్మెన్ & విశాఖ,అనకాపల్లి,విజయనగరం జిల్లాల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్టినేటర్, వై.వి.సుబ్బారెడ్డి , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు JPL క్రికెట్ టోర్నీ పోస్టర్లను ఆవిష్కరించారు.  విజయనగరంలోని 50 డివిజన్ లు – 50 టీమ్ లతో JPL పేరిట నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో విన్నర్స్ కు 50 వేల రూపాయల, రన్నర్స్ కు 25 వేల రూపాయల నగదు బహుమతి అందిస్తున్నామ‌ని అవనాపు విక్రమ్ దంపతులు తెలిపారు. టోర్నీ నిర్వాహ‌కుల‌ను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అభినందించారు.

Back to Top