అమరావతి: ముత్యాల ముగ్గులు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం వైయస్ జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా జరిగిన సంబరాలు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్ సీఎం దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా వేడుకలు ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం వైయస్ జగన్, భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం బసవన్నలకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో వారిరువురూ పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. హాజరైన డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సీఎం వైయస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.