తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర కాల్యుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టు చీఫ్ మినిస్టర్‌గా నూతనంగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు సమీర్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పూనం మాలకొండయ్య నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.