అసత్య ప్రచారాలు చేసిన వారే అభాసుపాలయ్యారు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

అత్యంత భక్తిభావంతో సీఎం వైయస్‌ జగన్‌ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు

రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొట్టేలా కొందరు వ్యాఖ్యలు చేశారు

పిచ్చిరాతలతో ఎల్లోమీడియా ప్రజలను పక్కదారి పట్టిస్తోంది

హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం ఉంది

అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యం

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన నుంచి దృష్టి మరల్చలేరు

తాడేపల్లి: వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేసిన వారే అభాసుపాలయ్యారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షోభం సృష్టించాలన్న తాపత్రయమే ప్రతిపక్షాల్లో కనిపిస్తుందన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో ప్రతిపక్షాలే చులకనవుతున్నాయన్నారు.అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యంగా తమ అనుకూల మీడియా ద్వారా వార్తలు ప్రసారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కుట్ర పూరితంగానే ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని రాజకీయ శక్తులు, ప్రజలకు సంబంధించిన అజెండా లేని రాజకీయ పార్టీలు కొన్ని, వారికి అనుగుణంగా ఓ మీడియా పరమైన శక్తులు అన్నీ కూడా ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ఎక్కడ లేని ప్రయత్నం చేశాయి. బహుశ ప్రజల కోసం ఏదో ఒక పోరాటం చేస్తున్నట్లుగా దానికి పదింతలు రాజకీయమైక కృత్రిమ పోరాటం సృష్టించి అసత్యాలు ప్రచారం చేశాయి. ఇందంతా కూడా ఒక్క నాయకుడిపైనే..వైయస్‌ జగన్‌ మీద గురి పెట్టి ఈ శక్తులన్నీ టార్గెట్‌ చేశాయి. ప్రభుత్వాన్ని ఎలాగైనా అస్థిరం చేయాలని కుట్రలు చేశారు. ప్రజల్లో వ్యతిరేకమైన భావన వస్తుందనే దురాశతో మా నాయకుడి మీద దాడులు మొదలుపెట్టారు. ప్రజలందరూ రెచ్చిపోతున్నారని ఏదేదో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం రెచ్చగొట్టేలా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఒక మతాన్ని రెప్రజెంట్‌ చేస్తున్నట్లు కొద్దిమంది కుట్రలు చేశారు. జరగకూడదని అవాంఛనీయ సంఘటనలు సృష్టించారు. యాధృచ్చికంగా విగ్రహాలు ధ్వంసమైతే..కొన్ని శక్తులు ముగ్గులోకి దిగి రాజకీయాలు చేశాయి. ఇంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా  మా ప్రభుత్వం తొణకని నిండుకుండలా పని చేస్తోంది. మమ్మల్నీ అస్థిరపరచాలనుకున్న శక్తులు మా నాయకుడిని చూసి షేక్‌ అయ్యాయి. 

చివరకు తిరుమల కొండపై డిక్లరేషన్‌ వరకు చేరింది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ పాలనలో కూడా వైయస్‌ జగన్‌ తిరుమలకు వెళ్లారు. జనమంతా కూడా వైయస్‌ జగన్‌ను అభిమానించి అధికారం ఇచ్చిన తరువాత కూడా ఆయన తిరుమలకు వెళ్తే మళ్లీ చిలువలు,పలువలు చేశారు. వీరంతా కూడా ఏ రోజు కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయలేదు. ఆ అవకాశం వీళ్లకి ఇవ్వలేదు. సమస్యలు ముందే ఊహించి పరిష్కరిస్తున్నాం. వారి దురాలోచనలు, కడుపు మంటలు వ్యక్తం చేశారే తప్ప..అధికారం లేక నాలుగు రోజులు కూడా బతకలేమన్నది స్పష్టమైంది. తిరుమలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఐదు కోట్ల ప్రజల ప్రతినిధిగా వైయస్‌ జగన్‌ వెళ్లారు. తిరుమలలో జరిగిన పూజల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైయస్‌ జగన్‌ ముఖంలో ఎలాంటి కల్మషం లేని లక్షణం, భక్తి కనిపించాయి. గౌరవం, ఆచార వ్యవహారాలు కనిపించాయి. చంద్రబాబు తిరుమల వెళ్లిన సమయంలో దిగిన ఫొటోలు చూస్తే..ఆయన యాంత్రీకంగా ఉంటారు. ఒక తపస్సు చేస్తే వచ్చే వెలుగు మాదిరిగా వైయస్‌ జగన్‌ ముఖంలో కనిపించింది. మెచ్చురిటీ, ప్రశాంతత వైయస్‌ జగన్‌లో కనిపించింది.  పాలకుడు ఒక కులానికి, మతానికి చెందినవాడు కాదు. అలాంటి చరిత్ర  వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఉంది, ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌కు మాత్రమే ఉంది. మార్క్సిస్ట్‌ విశ్లేషకుడు తెలకపల్లి రవి కూడా ఇదే చెప్పారు.

వైయస్‌ జగన్‌ ముఖంలో విశ్వాసం, భక్తి ఉంది. అత్యంత భక్తిభావంతో సీఎం వైయస్‌ జగన్‌ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని గౌరవించారు. ఇదే మంచి పాలకుడి లక్షణం. చంద్రబాబులో ఇది లేదు. ఒక సంక్షోభాన్ని క్రియేట్‌ చేసేందుకు సున్నితమైన అంశాలను చర్చకు పెట్టి అశాంతి కల్పించాలన్నదే చంద్రబాబు ఉద్దేశం. దీని వల్ల చివరకు అభాసుపాలు అవుతున్నాం. మేం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు ప్రణాళిక వేసుకుంటున్నారా? వైయస్‌ జగన్‌అంటే కొన్ని మతాలకు వ్యతిరేకమని మీరు క్రియేట్‌ చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలు మానుకోండి. ఇప్పటికే మీరు అభాసుపాలు అయ్యారు. మీరు పెట్టుకున్న లక్షణాలు దుర్దేశంతో ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మానుకోండి.  నీచమైన, చంఢాలమైన రాజకీయాలు సరికాదు. ఎందుకిలా చేస్తున్నారు. ఒక్కపక్క వేల కోట్ల అమరావతి భూ కుంభకోణం వెలుగు చూసింది. దానిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇది ఒక వేదిక ప్రతిపక్షానికి దొరికింది. వైయస్‌ జగన్‌ ఏకాకి అయినట్లు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి కుంభకోణాన్ని మరుగుపరిచేందుకు ఢిల్లీ నుంచి గల్లీదాకా ఉన్న చంద్రబాబు తన తాబేదారులను, ఏజెంట్లుగా కేంద్రంలో ఉన్న పార్టీలో పెట్టి, వారి అండతో న్యాయ వ్యవస్థలోకి దూరి దురదజల్లే ప్రయత్నం. పవన్‌ కళ్యాణ్‌ వంటి వ్యక్తులను కలుపుకొని రాజకీయాలు చేస్తున్నారు.

గతేడాదిన్నరలో వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచి పనులు గమనించండి. నిర్బరంగా తాను నమ్మిన విలువలతో రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యంగా ప్రతి అడుగు ప్రజా ప్రయోజనమే. ఎంత రెచ్చగొట్టినా కూడా వైయస్‌ జగన్‌ పట్టించుకోకుండా పోకస్‌గా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. మరింత వన్నెతెలిన బంగారం మాదిరిగా వైయస్‌ జగన్‌ కనిపిస్తున్నారు. అరుదైన లక్షణాలు, హీరోలో ఉండే లక్షణాలు వైయస్‌ జగన్‌లో కనిపిస్తున్నాయి. ప్రజలపై ఉన్న విశ్వాసం, దేవుడిపై ఉన్న విశ్వాసమే వైయస్‌ జగన్‌ను నడిపిస్తున్నాయి. పరిపాలనలో సంస్కరణలు తీసుకువస్తున్నారు. ప్రజలందరూ తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా కృషి చేస్తున్నారు. మహిళా సాధికారితకు చర్యలు తీసుకుంటున్నారు. నిన్నటికి నిన్న ప్రెండ్లీపోలీసు యాప్‌ను ప్రారంభించారు. టెక్నాలజీని వాడుకొని ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు. తక్కువ సమయంలో ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావడమే కాకుండా అధికారుల్లో మంచి చలనం తీసుకువచ్చారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్న  వైయస్‌ జగన్‌ విజయవంతమయ్యారు.

నిన్న ఢిల్లీ పర్యటనకువెళ్లిన వైయస్‌ జగన్‌ అక్కడి నుంచి తిరుమలకు వచ్చారు. అక్కడ జరిగిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వైయస్‌ జగన్‌ అంకితభావాన్ని ప్రధాని గుర్తించారు. రెండు రోజులుగా వాళ్ల ఏడుపుకు కూడా సమాధానం లభించింది. ఏదైనా రాసే సమయంలో అవతలి వ్యక్తి విశ్వసిస్తారా? అన్నది గమనించి రాతలు రాయాలి. ప్రజానాయకుడు. ప్రజల ఆశీస్సులు ఉన్న సీఎం..ఒంటి చేత్తో అవలీలగా పాలిస్తూ..రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారు. అలాంటి వ్యక్తిపై ఎందుకు కొరడ ఝులిపిస్తారు. ప్రధానినే సీఎం వైయస్‌ జగన్‌ను అభినందించారు. కోవిడ్‌ సమయంలో బాగా చేశారని, సచివాలయ వ్యవస్థ సూపర్‌ అని ప్రధాని ఒప్పుకున్నారు. ఇవన్నీ మీకు కనిపించవా..ఇలాంటి రాతలు మానుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
న్యాయస్థానాలపై తమకు విశ్వాసం ఉందని, అయితే కోర్టులు చేస్తున్న కామెంట్లు ప్రజలకు అనుమానం కలిగించేలా ఉన్నాయి. డీజీపీని రాజీనామా చేయాలని, ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించడం..ఇలాంటవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top