ఉద్యోగ సంఘాల‌తో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల భేటీ

తాడేప‌ల్లి: ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా ఆయన సమావేశమయ్యారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు సజ్జల రామ‌కృష్ణారెడ్డి వివ‌రించారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని.. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top