పింఛన్ ల పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

 60 లక్షల మందికి పింఛన్ లు ఇస్తున్న అంశాన్ని మరపించే విధంగా దుష్ప్రచారం చేస్తూ ప్రతిపక్షాలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

 వారికి టిడిపి అనుకూల మీడియా దుర్మార్గంగా వంతపాడుతోంది.

 తెలుగుదేశం,వారి అనుకూల మీడియా అరాచకాలను ఎండగట్టాలి.

 వాల్మీకి/బోయ కులాన్ని రాజకీయంగా ప్రోత్సహించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే.

వాల్మీకి/బోయ కులస్ధుల ఆత్మీయ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి 

 తాడేప‌ల్లి: జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం జడ్.పి.టి.సి., మండల అధ్యక్ష పదవి ఏ మండలంలో అయితే రెండూ ఓసిలకు రిజర్వ్ అయి ఉన్నాయో అక్కడ ఒక పదవి బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలకు ఇచ్చే విధంగా శ్రీ వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తద్వారా రిజర్వేషన్లను దాటి కూడా బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ వర్గాలకు మేలు చేయాలని శ్రీ వైయస్ జగన్ కంకణం కట్టుకున్నారనేది తెలుస్తుందన్నారు.
వాల్మీకి/బోయ కులస్ధుల ఆత్మీయ సమావేశం గురువారం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. సమావేశానికి వాల్మీకి/బోయ కార్పొరేషన్ చైర్మన్ డా.మధుసూదనరావు అధ్యక్షత వహించారు.
సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వాల్మికి కులానికి సంబంధించి ఈ సమావేశంలోనే మున్సిపల్ ఛైర్ పర్సన్స్ ఐదుగురు, వైస్ ఛైర్మన్లు ముగ్గురు, మేయర్, డిసిసిబి, జిల్లా గ్రంధాలయసంస్ధ, పుట్టపర్తి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటి, పార్లమెంట్ సభ్యులు, మంత్రి కనిపిస్తున్నారన్నారు. ఇన్ని పదవులను వాల్మికి కులానికి శ్రీ వైయస్ జగన్ ఇచ్చారంటే ఆయన వాల్మికి కులాన్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్దమవుతుందన్నారు. భవిష్యత్తులో మరింత మంది ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశం ఉందన్నారు. బిసి కులాలు కేవలం తమ కులాలకే కాకుండా ఇతర కులాలకు కూడా నాయకత్వం వహించే విధంగా నేతలుగా ఎదిగేందుకు శ్రీ వైయస్ జగన్ ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. శ్రీ వైయస్ జగన్ చిత్తశుధ్దితో పేదవర్గాలకు వారిలో పేదరికాన్ని పోగొట్టేందుకు అనేక సంక్షేమ పథ‌కాలు అమలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా అరాచక దుష్ప్రచారంతో కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకుని ప్రజలకు వాస్తవాలు వివరించాలన్నారు. చంద్రబాబు కాలంలో కేవలం 39 లక్షలమందికి మాత్రమే పింఛన్ లు అందిస్తుంటే శ్రీ వైయస్ జగన్ ఆ సంఖ్యను 60 లక్షలకు పెంచారన్నారు. వారిలో అనర్హులుంటే వారిని తొలగించి మరింతమంది అర్హులకు వాటిని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే అందరికి పింఛన్ లు తొలగించేస్తున్నారంటూ నానాయాగి చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. వాటిని ఎండగట్టాలన్నారు. సమాజశ్రేయస్సు, రాష్ర్ట భవిష్యత్తుకు కంకణం కట్టుకున్న ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు.

మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వాల్మీకి రామాయణం రచిస్తే, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాలు బాగు చేసే కార్యక్రమం రచిస్తున్నారని అన్నారు. రాష్ట్ర రాజధానిలో వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బోయలను గుర్తించి ప్రోత్సహిస్తున్న పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, బోయల అభివృద్ధికి ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని వివరించారు.

రాష్ట్ర కార్మిక శాఖమంత్రి శ్రీ గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్ బోయ, వాల్మికి కులానికి ఏవైతే వాగ్దానం చేశారో వాటిని నిలబెట్టుకున్నారన్నారు. తనను ఎంఎల్ ఏగా గెలిపించి మంత్రిని చేసిన ఘనత శ్రీ వైయస్ జగన్ దని అన్నారు. వాల్మికి కుల చిరకాల కోరిక అయిన ఈ కులాన్ని ఎస్టిగా గుర్తింపు రావాలనే అంశంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారితో మాట్లాడటం జరిగిందన్నారు. ఆ అంశంపై తలారి రంగయ్య ఇతర పెద్దలతో కలసి కేంద్రప్రభుత్వాన్ని కలసి తగిన విధంగా కృషి చేయాలని సూచించారన్నారు. ఎందుకంటే ఆ అంశం కేంద్ర పరిధిలోనిది కాబట్టి ఆ విధంగా చేయమన్నారని తెలిపారు. వాల్మికి కులస్దులను రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. శ్రీ వైయస్ జగన్ కు వాల్మికి కులస్ధులు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య మాట్లాడుతూ వాల్మీకి/బోయ కులస్దులను అన్ని విధాల అభివృధ్ది చేసేందుకు శ్రీ వైయస్ జగన్ పలు పథ‌కాలను అమలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా తనలాంటి వారిని ఎంపిగా నిలబెట్టి గెలిపించిన ఘనత శ్రీ వైయస్ జగన్ దని అన్నారు.

ఎమ్మెల్సీ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ బిసి కులాల సమస్యలను పరిష్కరించే ఉధ్దేశ్యంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో గత రెండు నెలలుగా బిసి కులాలకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. వారికి సంబంధించిన సమస్యలను తమకు తెలియచేస్తే తగిన విధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. శ్రీ వైయస్ జగన్ బిసి కులాల అభ్యున్నతికోసం అలుపెరగక పనిచేస్తున్నారని వివరించారు.

శాసనమండలి సభ్యులు శ్రీ జంగాకృష్ణమూర్తి మాట్లాడుతూ వాల్మికి కులస్ధులు అడవినే నమ్ముకుని జీవనం సాగించేవారన్నారు. వారికి సంబందించి కులధృవీకరణ పత్రాల జారీ విషయంలో పలు సమస్యలు ఉన్నాయని అన్నారు. బిసి అధ్యయన కమిటి పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు కొన్ని ప్రాంతాలలో వాల్మికిలు బిసిలు గాని మరికొన్ని ప్రాంతాలలో ఎస్టీలు గాను ఉన్నారన్నారు. దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదే నని అన్నారు.

సమావేశంలో నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకం రెడ్డి నారాయణ మూర్తి, వాల్మీకి/బోయ కార్పొరేషన్  డైరెక్టర్లు మరియు రాష్ట్ర వాల్మీకి/బోయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top