అనంతపురం: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబుకు తెలియదా అని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని ఫైర్ అయ్యారు. అనంతపురంలో ససోమవారం పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేసి విజయం సాధిస్తామని చెప్పారు. అబ్ధాలతో ప్రజలు తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు డ్రామా సృష్టించారని విమర్శించారు. టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం మాకు లేదన్నారు. చంద్రబాబు తన పార్టీ పరిస్థితిపై ఆతత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎస్ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి బాబు నానాయాగీ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా అందరూ సమన్వయకంతో పని చేయాలన్నారు. లేని ప్రతిపక్షం గురించి మాట్లాడటం అనవసరం. 2019లో ప్రజలు ఛీకొట్టి టీడీపీని డస్ట్‌బీన్‌లో పడేశారు. చంద్రబాబు తనకున్న ససహజ లక్షణంతో , తనకున్న మీడియాతో, టక్కుటమార విద్యలు పంచాయతీ ఎన్నికల్లో ప్రదర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఊహించి ముందే ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని ఈ రోజు తిరుపతిలో ఆందోళన చేస్తానని డ్రామా చేస్తున్నారు. ఇంత ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. టీడీపీకి నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదు. దీంతో నామినేషన్లు వేయించడం లేదని కొత్త రాగం అందుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ పార్టీకి ఇవాళ నామినేషషన్ వేస్తే ఎవరైనా ఆపగలరా? పార్టీ గుర్తు లేని పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ క్లిన్‌షిప్ చేసింది. పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. మా పార్టీలోనే పోటీకి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎయిర్‌పోర్టులో డ్రామాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌తో అనుమతి తీసుకోకుండా ఎయిర్‌పోర్టులో డ్రామా చేస్తే ఎవరైనా విలువ ఇస్తారా? . ఆ రోజు వైయస్ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తే ఆరోజు వైయస్ జగన్‌ను ఆపింది దారుణం. దాన్ని దాష్టికం అంటారు. ఈ రోజు ఎలాంటి కారణం లేకుండానే చంద్రబాబు నానాయాగీ చేస్తున్నారు. దీన్నిచౌకబారుతనం, దిగజారు తనం అంటారు. మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలను మభ్యపెడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో లేని హామీలు ఇస్తున్నారు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ప్రజలందరిని కోరుతున్నాం. ఎన్నికలంటే నిష్పక్షపాతంగా జరగాలని సీఎం వైయస్ జగన్ కోరుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం సహకరిస్తోంది. మాకు మేమే నిబంధనలు పెట్టుకొని ఎన్నికల్లో నిజాయితీగా పని చేస్తున్నాం. ఇలాంటి సమయంలో చంద్రబాబు డ్రామాలు ఆడటం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.