ఉన్మాద స్థాయిలో ఉన్న వారే విధ్వంసానికి పాల్పడ్డారు 

నీచ రాజకీయాలను సీఎం వైయస్‌ జగన్‌ సహించరు

ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయి 

భద్రతలేని గుళ్లను టార్గెట్‌ చే స్తున్నారు

దేవుడి విగ్రహాలను పగలగొడతే ఎవరికి లాభం?

సున్నితమైన అంశాలపై మేమెప్పుడూ ఉద్యమాలు చేయలేదే?

కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నాం

మతం పూర్తిగా వ్యక్తిగతం..ఎవరి విశ్వాసాలు వారివి

దివాళా తీసిన టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతోంది
 

చంద్రబాబు క్రిస్టియన్‌ ఓట్లు వద్దనుకుంటున్నారేమో?

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ బాధ్యతారహితమైన ఆరోపణలు చేయలేదన్నారు.చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చేశారని, బూట్లు వేసుకొని పూజలు చేశారని గుర్తు చేశారు. సదావర్తి భూములను తన అనుయాయులకు కట్టబెట్టారని పేర్కొన్నారు. దాడుల వెనుక ఉన్న నిందితులను పట్టుకుని తీరుతామని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ రోజు అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలకు ప్రతిపక్షాలు తెర లేపాయి. మతాలు, దేవుళ్లతో ఆడుకుంటున్నారు. ఒక్కటే సూటి ప్రశ్న సీఎం వైయస్‌ జగన్‌ అడిగారు. వరుసగా, ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైతే భద్రత ఏర్పాట్లు సరిగ్గా ఉండవో? చిన్న చిన్న గుళ్లు ఉన్న వాటిని టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారు. విగ్రహాలను విరుగగొట్టడం, వెంటనే ఒక ఉద్యమం చేపట్టడం కనిపిస్తోంది. ఇలా రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాలను నష్టం కలిగించడం ద్వారా సీఎం వైయస్‌ జగన్‌కు, ప్రభుత్వానికి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏదైనా ప్రయోజనం కలుగుతుందా? మెడపై తల ఉన్న ఎవరైనా, ఒ కటో తరగతి చదువుతున్న పిల్లాడికి కూడా ఇది బాగా తెలుస్తుంది. వైయస్‌ జగన్‌ తెర వెనుక ఉండి నడుపుతున్నారని అంటున్నారు. ఏ ప్రయోజనం ఆశించి సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలి.

రాష్ట్రంలో 60 వేల ఎకరాలకు పైగా స్థలాన్ని సేకరించి వేలాది కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పేదలకు పట్టాలిస్తున్న సందర్భంలో వీటి గురించి పబ్లిసిటి పొందాలనుకుంటారా? లేదా ఆలయాల్లో విగ్రహాలు పగులగొట్టి ప్రచారం చేసుకోవాలనుకుంటారా?. లేదా ఇవాళ టీడీపీ అధికారంలోకి రాబోతుందా?. ఒక వేళ వాళ్ల దురాలోచన మాకు ఉన్నాయనుకుంటే..వైయస్‌ జగన్‌  ఇలాంటి తుచ్చమైన, నీచమైన ఆలోచనలు చేయలేదు. పదేళ్ల పాటు పోరాడి, ప్రజల్లో ఉంటూ..ప్రజల మద్దతుతో రాచ మార్గంలో ఇవాళ అధికారంలోకి వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ప్రజల ప్రాణాలకు, మానాలకు సంబంధం లేని, సున్నితమైన మతపరమైన అంశాలపై ఏరోజైనా ఉద్యమాలు చేపట్టామా? వీలైతే తగ్గించే ప్రయత్నం ఆ రోజు చేశాం.

ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఆ రోజు ఉద్యమాలు చేశాం. సున్నితమైన, మత పరమైన అంశాలు స్వామిజీలు, మత గురువులు, బిషప్‌లు, ముస్లిం మత పెద్దలు మాట్లాడుకోవాలే తప్ప..రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం ఉండదు.  మతం పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి విశ్వాసాలను వారు గౌరవించాలి. ఆ విశ్వాసాలకు భంగం కలుగకుండా చూడాలి. ప్రభుత్వం వీటికి అతీతంగా ప్రజలకు సంబంధించిన ఇతర అంశాలు, దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కులాలు, మతాలకు అతీతంగా వైయస్‌ జగన్‌ పరిపాలిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలతో మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. అంతిమ తీర్పు ప్రజలే ఇవ్వాలి. ఎవరైతే రాజకీయంగా దివాలా తీశారో..ఎవరైతే జనం చేతిలో ఘోరమైన అవమానానికి గురై..అడ్రస్‌ గల్లైంతన టీడీపీకి ఇలాంటివి ప్రయోజనం. వైయస్‌ జగన్‌ ప్రజా రంజక పాలన చేస్తుండటంతో టీడీపీకి ఉన్న ఏకైన అస్త్రం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. 

ఇక బీజేపీ ముందు నుంచి మతం అన్నది వాళ్ల అజెండాలో ఉంది. చంద్రబాబు వైఖరి మాత్రం గతంలో ఇలా లేదు. ఇప్పుడు పూర్తిగా విప్పేసి..మతంపైనే రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ తనను కలుపుకుపోతారని భావించి చంద్రబాబు ఇలా చేస్తున్నారేమో? వైయస్‌ జగన్‌పై ప్రజల్లో అనుమానాలు సృష్టించవచ్చు అని చంద్రబాబు  ఇలా చేస్తున్నారో మేం అనుమానించాల్సి ఉంది. అధికారాన్ని ఎప్పుడు రుచి చూడని పార్టీ మాదిరిగా ఇలాంటి స్టాండ్‌ తీసుకుంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో ఇలాగే విగ్రహాలు పగులగొడితే..రాత్రికి రాత్రే విగ్రహాలు ఏర్పాటు చేశారేమో తెలియదు. ఎవరు లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి విధ్వంసాలకు పాల్పడితే..దేవుడి విగ్రహాలను పగులగొడితే ఎవరికి లాభం?.

వైయస్‌ఆర్‌సీపీ పదేళ్ల చరిత్రలో ఇంత బాధ్యతారహితంగా ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయం. సొంత తల్లి, తండ్రి, చెల్లెలు సైతం చంపే స్థాయికి వెళ్లే ఉన్మాదులకు మాత్రమే ఇలాంటి దురాఘాతాలు చేస్తారు. చంద్రబాబు తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటున్నారు. 14ఏళ్లు సీఎంగా పని చేశారు. ఆయన హయాంలో ఎన్నికేసులు జరిగాయి. వీటిలో ఎన్ని పరిష్కరించారు. లెక్కలు తీసి చెప్పండి. మాకు ఇదే పని పెట్టుకోలేదు కాబట్టి..మీ లెక్కలు తీయలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మాత్రమే మాకుంది. ప్రజల సమస్యలే ప్రభుత్వ బాధ్యత. వాటిపైనే మేం దృష్టి పెట్టాం.
గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు తన షూటింగ్‌ కోసం గేట్లు మూసివేస్తే..జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 29 మంది చనిపోయారు. అది మర్డర్‌. మాస్‌ మర్డర్‌ చేశారు. పవిత్రమైన పుష్కరాల్లో ఘోరమైన అపచారం చేశారు. విజయవాడ పరిసరాల్లో కృష్ణ పుష్కరాల పేరుతో గుళ్లు కూల్చేశారు. ఏ రోజు చంద్రబాబు పవిత్రమైన ప్రదేశానికి వెళ్లినప్పుడు షూ విప్పి..గౌరవప్రదంగా పూజలు చేసినట్లు ఏ ఫొటో కనిపించదు. ఫిజికల్‌ ప్రాబ్లమేమో..మేమంటున్నాం. చంద్రబాబు ఏ రోజు కూడా చెప్పలేదు. అలాగే సదావర్తి సత్రం భూములు ఘోరంగా కొల్లగొట్టాలని చూశారు. టీటీడీ జరిగిన ఘటనలు ఉన్నాయి.

గతంలో టీడీపీ అధికారంలో ఇలాంటి ఘోరాలు అనేకం చేశారు. గురివింద గింజ మాదిరిగా ఈ రోజు  ఎదుటి వైపు వేలు చూపించాలని భావిస్తే..మూడు వేళ్లు మీపై చూపిస్తాయి. మతపరమైన రాజకీయాలు చేస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?. బీజేపీ కూడా ఇలా చెప్పలేదు. ఎందుకు ఇంత తొందర. వైయస్‌ జగన్‌ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. పక్కా ఇళ్లు నిర్మిస్తుంటే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. మీరు చేస్తున్న ద్రోహం, నష్టం అంతా ఇంత కాదు. ఏ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించరు. దేవుళ్లకు అపచారం చేస్తున్నారు. ప్రజలకు చేశారు..అది అయిపోయింది. ఇప్పుడు దేవుళ్ల జోలికి వెళ్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దీని వెనుక ఉన్న ముఠాను కూడా పట్టుకుంటాం. రామతీర్థం ఘటనను సీఐడీకి అప్పగించారు. దోషులు బయటకు వస్తారు. భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదు. ఇలాంటి ఘటనలతో టీడీపీకే నష్టం కలుగుతుంది. ఆలయాల వద్దకు ఎవరైనా వెళ్లవచ్చు. ఉద్రేకాలు రెచ్చగొట్టడం సరికాదు. వెళ్లే ముందు మనం ఏం చేస్తున్నామన్నది రాజకీయ నేతలు ఆలోచన చేయాలి.

చంద్రబాబుకు క్రిస్టియన్లు ఓట్లు వేయకుండానే సీఎం అయ్యారా? చంద్రబాబు క్రిస్టియన్‌ ఓట్లు వద్దనుకుంటున్నారేమో?. ఇది సరైన పద్ధతి కాదు. మతపరమైన స్వాములు, పీఠాధిపతులు మాట్లాడుతున్నారు. వారికి విజ్ఞప్తి..మతపరమైన ప్రయోజనాలు పొందే రాజకీయ పార్టీల ఉపన్యాసాలకు ప్రభావం కావద్దు. ఎవరో ఉన్మాది ఇలాంటి చర్యలు చేసి ఉండాలి. మతాధిపతులు, స్వాములు సంయమనం పాటించి, ప్రభుత్వానికి సూచనలు చేయాలి. నగల కోసం విగ్రహాలు ధ్వంసం చేశారంటే అందులో ప్రయోజనం ఉందనుకుందాం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గుడిలో విగ్రహాన్ని కూల్చారంటే అందులో ఏదో కుట్ర ఉందని అందరికి తెలుసు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారు.

ఈ సమయంలో కావాల్సింది..ఇలాంటివి చేసిన వారు తప్పించుకోలేరన్న హెచ్చరిక ఉండాలి. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకూడని విధంగా చర్యలు ఉంటాయి. గతంలో దారి దోపిడీలు జరిగేవి..ఇప్పుడు ఇలాంటివి లేవు. గ్రామ పెద్దలు, నాయకులు గ్రామాల్లో గస్తీలు నిర్వహించి, పోలీసులకు సహకరిస్తే త్వరగానే ఇలాంటివి కంట్రోల్‌ చేయవచ్చు. జనసంచారం లేని ప్రాంతాల్లో జరిగే వాటికి పోలీస్‌ యంత్రాంగమే మొత్తం చేయాలనడం సరికాదు. పౌరులు కూడా సహకరించాలి. ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు అప్పగిస్తే..మరొకరు చేయరు. విజ్ఞులైన ప్రజలంతా కూడా మతాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే వారి సమస్యలు తీర్చాలే తప్ప..ఆధ్యాత్మిక సమస్యలు తీర్చేందుకు మత గురువులు, బోధకులు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సహకరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top