సంచార జాతులకు ప్రాధాన్యత ఇచ్చిన నేత సీఎం వైయ‌స్‌ జగన్‌

వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: సంచార జాతులకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయ‌స్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైయ‌స్‌ జగన్‌ అమలు చేస్తున్నారని, వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబు హయాంలో ఇన్ని అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. సమాజంపై, ప్రజలపై సీఎం జగన్‌కు ప్రేమ ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సీఎం చెప్పినట్లు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top