విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఉవ్వెత్తున ఎగసి ఉత్సాహంగా సాగింది. విశాఖ నగరంలోని డైమండ్ పార్కు నుంచి డాబాగార్డెన్స్, జగదాంబ సెంటర్, ,పూర్ణామార్కెట్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు కు జనసందోహం మధ్య బైక్ ర్యాలీ స్వాగత యాత్రతో సామాజిక సాధికార బస్సు చేరుకుంది. అంతకుముందు నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించి, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణీ, వంశీకృష్ణ శ్రీనివాస్ లు బహిరంగ సభకు హాజరయ్యారు. వైయస్ జగన్ ఒక నిజం.. చంద్రబాబు ఓ అబద్ధం, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపిన దివ్య ఔషధం జగనన్న అమ్మఒడి - మంత్రి చెల్లుబోయిన టౌన్ కొత్త రోడ్డు జంక్షన్ వద్ద జరిగిన సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, సామాజిక సాధికారిత అనే మాట చెప్పడానికి జగన్ కు తప్ప దేశంలో మరే నేతకు అర్హత లేదన్నారు. అణగారిన వర్గాలకు ఆలోచన చేసే శక్తి లేదన్నది చంద్రబాబు భావన అని మండిపడ్డారు. మోసానికి ఒక రూపం , అబద్ధానికి ఒక రూపం చంద్రబాబు అని విమర్శించారు. అనుభవం కలిగిన నేతనంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తాడని, బీసీల అప్పుల తీర్చేస్తానని, ఇంటికో ఉద్యోగం, మహిళలకు డ్వాక్రా రుణాలు కట్టేస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన నాయకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. నిజం అంటే జగన్, అబద్ధం అంటే చంద్రబాబు అని నినదించారు. మత్స్యకారులకు కష్టం వస్తే గంటలో చెక్కులు పంపిణీ చేయించిన నేత జగన్ నిజమైన నేత అయితే, మోసాలతో కాలం వెళ్లబుచ్చే అబద్దం చంద్రబాబు అన్నారు. అబద్దం 14 ఏళ్లు ప్రజల్ని పట్టి పీడిస్తే, నిజం రూపంలో కలలను సాకారం చేస్తున్న జగన్ మనకు ముద్దు అని పేర్కొన్నారు. పేదరికం నిర్మూలించడానకిి వచ్చిన అవతార రూపమే జగన్ అని అభివర్ణించారు. అమ్మఒడి అనే ఔషధం వేసి బాల కార్మిక వ్యవస్థను రూపు మాపిన స్పూర్తిదాయక నేత జగన్ అన్నారు. మరోసారి సీఎంగా జగన్ గెలుపు ఉత్తరాంద్ర నుంచే ఆరంభం కావాలి. సామాజిక సాధికార చోదక శక్తి జగన్ - స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి జరగాల్సి ఉన్నా సాధ్యం కాలేని పరిస్థితిలో రాజ్యాంగానికి గౌరవం లేని దుస్థితిలో , తన నాలుగున్నరేళ్ల పాలనలో అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసి సామాజిక సాధికారతకు చోదక శక్తిగా జగన్ నిలిచారన్నారు. వీధిలో కాలువ, రోడ్డు, బిల్డింగ్ కడితేనే అభివృద్ధా. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం అభివృద్ధా అన్నది చెప్పాలని కోరారు. ప్రజల డబ్బును చంద్రబాబు తమ ఖాతాల్లో వేసుకొన్నారని, జగన్ బడుగు, బలహీన వర్గాల చేయూతనిచ్చేలా వారి ఖాతాల్లో వేస్తున్నారన్నారు. పేదరికం దేనికీ అడ్డంకి కారాదన్నది సీఎం జగన్ అభిమతమని స్పీకర్ తమ్మినేని ఉద్ఘాటించారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవమే ఈ సామాజిక సాధికార యాత్రని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎన్నో పార్టీలు పాలించినా సరే ఇంత జవాబుదారీతనం, పాదర్శకత ఎన్నడూ లేదని, సీఎం గా జగన్ హాయాంలో ఎటువంటి మధ్యవర్తులు, అవినీతి లేకుండా నేరుగా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. చంద్రబాబు ఎవరిని అడిగి రాజధానిగా అమరావతిని ఏర్పాటుచేశారు. తాను రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, తన కుటుంబీకులకు, కుల వర్గాలకు లబ్ధి చేయడానికే అమరావతిని రాజధానిగా అర్థరాత్రి ప్రకటించారని విమర్శించారు. జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన గౌరవం నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. మరోసారి సీఎంగా జగన్ గెలుపు ఉత్తరాంధ్ర నుంచే ఆరంభం కావాలన్నారు. బోటు ప్రమాాద బాధితులకు పవన్ టీడీపీ ప్యాకేజీ డబ్బులిస్తే తీసుకోవద్దు, బాబును ఓడించేది మత్స్యకారుడైన భరతే - మంత్రి సీదిరి మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, అభివృద్ధిలో వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వలస పోకుండా విశాఖలో ఓడ రేవును నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. అమరావతి రైతులు తమ స్వార్థం కోసం ఉద్యమాలు చేస్తున్నారని, రాజధాని ఉంటే తమ భూములకు రేట్లు పెరుగుతాయని, వ్యాపారాలు వస్తాయని పోరాటాలు చేస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే చంద్రబాబు ఇక్కడ మాఫియాలు పెరిగిపోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధాని చేస్తే అక్కడ మాఫియాలు, అన్యాయాలు, అక్రమాలు జరగవా అని నిలదీసారు. ఉత్తరాంధ్రను అవమానించేలా చంద్రబాబు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే చంద్రబాబు నోట ఇలాంటి మాటలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తూ ఉత్తరాంధ్రకు జగన్ గొప్ప వరం ఇచ్చారని, ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు. ఒక మత్స్యకారుడుని పార్లమెంట్ కు పంపి ఆత్మగౌరవాన్ని జగన్ చాటి చెప్పారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేది కూడా ఓ మత్స్యకారుడైన కుప్పం నాయకుడు భరత్ కావడం ఖాయమన్నారు. ఫిషింగ్ హార్బర్ లో బోటు అగ్ని ప్రమాదం జరిగితే సీఎం జగన్ అండగా నిలిచి తక్షణ సాయాన్ని ప్రకటించారన్నారు. ప్రమాద ఘటన దగ్గరకు వచ్చి టీడీపీ, జనసేన వంటి పార్టీలు అన్యాయంగా ఆందోళన చేసాయని, ప్రభుత్వం ఉదారంగా చేయూతనిచ్చినా రాజకీయాలు చేయడం సబబు కాదని సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. మత్స్యకారులకు డబ్బు సాయం చేస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బు కాకుండా టీడీపీ నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బు ఇస్తారని మత్స్యకారులు ఎవరూ తీసుకోవద్దని పిలుపునిచ్చారు. మత్స్యకారులపై పవన్ కు అంత అభిమానం ఉంటే, గతంలో చంద్రబాబు అవమానపరిచినపుడు ఆయన్ను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసారు. సీఎం జగన్ పాలనలో మత్స్యకారులు ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్నారని, పవన్ వంటి నేతల వద్ద చేయి చాచాల్సిన కర్మ పట్టలేదని ఎద్దేవా చేసారు. రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకుంటే, జగన్ తనని నమ్ముకున్న వారికి ఇచ్చారు - ఎంపీ మోపిదేవి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, ప్రజలందరినీ సరి సమానంగా చూడాలని పరితపించే సీఎం జగన్ సామాజిక సాధికారతను ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ప్రతీ పేదవాడిని ఆర్థికంగా బలంగా నిలబెట్టేందుకు దమ్ముతో ధైర్యంగా రాజకీయంగా తలెత్తుకుని తిరిగేలా నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఉద్ఘాటించారు. పేదల జీవన స్థితిగతులను మార్చేందుకు సక్షేమం చేపట్టి భారతదేశానికే నాంది పలికిన ఘనత జగన్ దేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక ప్రజా నాయకుడు జగన్ అని, శాసనసభ, మండలి, రాజ్యసభ, కేబినెట్ లోనూ కూడా అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత పాలకులు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటే సీఎం జగన్ తనను నమ్ముకున్న వర్గాలకు కేటాయించారని, 9 రాజ్యసభ స్థానాల్లో 4 బీసీలకు కేటాయించిన చరిత్ర జగన్ దని గుర్తు చేసారు. మానవ తప్పిదంగా ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటే సీఎం జగన్ హుటాహుటిన స్పందించి బాధితులకు నూటికి 80 శాతం సాయం చేస్తామని ప్రకటన చేసి తానున్నాననే అభయమిచ్చారన్నారు. హుదూద్ బాధితులకు ఇప్పటికీ పరిహారాన్ని టీడీపీ అందించలేకపోయిందని, మత్స్యకారులకు ప్రమాదం జరిగితే వెంటనే సాయమందించేలా చర్యలను జగన్ చేపట్టారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చంద్రబాబు చేస్తే, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు జగన్ ముందడుగు వేస్తున్నారన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మాట్లాడుతూ, మత్స్యకారుడునైన నన్ను సీఎం మూడోసారి ఎంఎల్ఏ చేయడానికి సంకల్పించారని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. సామాజిక సాధికారతను తన భుజస్కంధాలపై జగన్ వేసుకుని అమలు చేస్తున్నారు. గత పాలకులు కులాలను విభజించి బానిసలుగా చేసుకుని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే, సీఎం జగన్ మాత్రం అన్ని జాతులకు సమ ప్రాధాన్యతనిస్తూ అగ్ర వర్ణాలకు ధీటుగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సుల మేరకు నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తక్షణమే పరిష్కరించే బాధ్యత తనదేనంటూ ప్రజల సమక్షంలో ప్రమాణం చేసారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే ఫర్వాలేదు తనవాళ్లు బాగుంటే చాలు అనుకునే వ్యక్తి చంద్రబాబు అయితే, అందరూ బాగుండాలి. అందులో తానూ ఉండాలి అనుకునే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసేది వైయస్సార్ సీపీ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. దివంగత వైెస్ రాజశేఖర్ రెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్లతో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించగలిగామని, సీఎం జగన్ మైనార్టీలకు డిప్యూటీ సీఎం కూడా కేటాయించారని వివరించారు. ముస్లింలకు షాదీ తోఫా అప్పట్లో కేవలం రూ. 50 వేలు ఇస్తే, జగన్ లక్ష రూపాయలు చేసారని, ఇమామ్ లకు రూ. 5 నుంచి 10 పదివేలు చేసారని, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నందుకు జగనే తమ నమ్మకమని ఉద్ఘాటించారు.హజ్ యాత్రకు కూడా విశేషంగా ఆర్థిక సాయం చేస్తూ చేయూతనిస్తున్నారని కొనియాడారు.