వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారయాత్రను విశేషంగా హాజరయిన జనం విజయవంతం చేశారు. బహిరంగ సభ కూడా బాగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డా.సుధ అధ్యక్షత వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ బుట్టారేణుక మాట్లాడారు. సభలో వక్తలు ఏమన్నారంటే... డిప్యూటీ సీఎం నారాయణస్వామి – ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు అన్ని కులాలుకూ సేవచేసేవాళ్లు. ఈరోజు మాలోనే ఎమ్మెల్యేలు అయ్యారు. గతంలోనూ ఎమ్మెల్యేలయి ఉన్నారు. అయినా నాడు వారికి స్వేచ్ఛ లేదు. అధికారం లేదు. కానీ ఈరోజు పరిస్థితులు మారాయి. – ఈరోజు జగనన్న వచ్చారు. ఆయనకు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల వారంటే ప్రేమ. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయిని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న – జగనన్న పాలన చూసి మనమంతా సంతోషపడాలి. జగనన్న పాలనలోనే మన కుటుంబాలు బాగుపడ్డాయి. భవిష్యత్తులోనూ బాగుండాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. –ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల గుండెల్లో దేవుడిగా కొలువైనాడు జగనన్న. – ఐదుగురు బీసీలను రాజ్యసభ మెంబర్లను చేసిన జగనన్న, – కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసి...వాటిలో ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులిచ్చి వారి స్థాయిని పెంచిన ఘనత జగనన్నదే. – తనకు ఓటేసిన వారిని మోసం చేసే గుణమున్నవాడు చంద్రబాబు – జగనన్న తనకు ఓటు వేసినవారికి సేవ చేశాడు. చేస్తున్నాడు – మాట తప్పని కులం, మడమ తిప్పని మతం జగనన్నది. – కూలీవాడి కొడుకు కూలీగానే ఉండాలని ఆలోచించేవాడు చంద్రబాబు. కూలీవాడి కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచన చేసి..అందుకోసం ఏమి చేయాలో అదంతా చేస్తున్నాడు జగనన్న. – చదువు పేదల తలరాతలు మారుస్తుందని..ఆ రంగంలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ –అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలని..గతంలో మహనీయులెందరో కలలు కన్నారు. ఆ దిశలో ఎంతో కృషి చేశారు. – జగనన్న వారి కలలను అర్థం చేసుకున్నారు. సామాజిక సాధికారత అవసరాన్ని గుర్తించారు. అంబేడ్కర్, ఫూలేల ఆశయాల బాటలో నడిచి, ఈ రోజు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల నాయకులను అధికారపదవుల్లో కూర్చోబెట్టి..వారి రాజకీయ,సామాజిక,ఆర్థిక స్థాయిని పెంచారు. – బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన నలుగురిని డిప్యూటీ సీఎంలుగా చేసి..తన పక్కన కూర్చోబెట్టుకున్నారు జగనన్న. అలాగే మంత్రివర్గంలో ఉన్న 25మందిలో 17మంది ఆయావర్గాల వారికే కేటాయించారు. – వైద్యరంగంలో జగనన్న అద్భుతాలు చేశారు. ఏ పేదవాడికైనా జబ్బు చేస్తే ... భయపడాల్సిన అవసరం లేకుండా చేశారు. మాజీ ఎంపీ బుట్టారేణుక – ఈరోజు ప్రతి ఒక్క సామాజికవర్గంలోని ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపి,వారికి అధికారపదవులు ఇచ్చారు జగనన్న. – గతంలో ఎన్నడూ లేని రీతిలో పరిపాలన అందిస్తున్నారు జగనన్న – వలంటీర్ల ద్వారా సంక్షేమపథకాలు ఇంటి దగ్గరే అందేలా చేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. –ఆరోగ్యశ్రీని ఎంతో బలోపేతం చేసి..పేదల పాలిట దేవుడే అయ్యాడు జగనన్న. – మహిళల గురించి ప్రత్యేకంగా ఆలోచించే జగనన్న..వారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. – ఇళ్లపట్టాలు మహిళల పేరునే ఇస్తున్నారు. – కరోనాలాంటి కష్టకాలంలో జగనన్న పాలించిన తీరు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదు. ధైర్యాన్ని నూరిపోయడమే కాదు..ఆర్థిక సాయం కూడా అందించి కరోనా కాలంలో జగనన్న దేవుడే అయ్యారు. –చంద్రబాబును నమ్మితే మనం కష్టాలు పడాల్సిందే – సంక్షేమపథకాలు అమలు కావాలన్నా..పేదల జీవితాలు బాగుపడాలన్నా జగనన్నే మళ్లీ రావాలి.