వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నాం

ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీన ప్రకటనపై కార్మికులు,ఉద్యోగులు హర్షం

చిత్తూరు జిల్లా: ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వంలో విలీనం చేస్తే మా బతుకులు బాగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో సుమారు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారన్నారు. నేడు ఆర్టీసీ బతికి ఉండటానికి కారణం దివంగత ముఖ్యమంత్రి  వైయస్‌ఆర్‌ చలువేనన్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణంతో ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారన్నారు.చంద్రబాబు పాలనలో స్వార్థపూరిత విధానాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంచిరోజులు కోసం ఎదురుచూస్తున్నామని,ఆయన తనయుడు  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రయాణికులకు కూడా అనేక సౌకర్యాలు కలిగే అవకాశం ఉంటుందన్నారు.చంద్రబాబు పాలనలో అంతా మోసం,కుట్రలేనన్నారు. మేమంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని తెలిపారు.

 

Back to Top