టూరిజం మినిస్టర్‌గా ఆర్కే రోజా బాధ్యతల స్వీకరణ

సచివాలయం: పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పిస్తామని మంత్రి రోజా చెప్పారు. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆర్కే రోజాకు ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు.
 

Back to Top