నిజమైన ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ నిర్వచనం చూపించాం

‘వైయస్‌ఆర్‌ నవోదయం’తోఎంఎస్‌ఎంఈ యూనిట్లకు పునర్జీవం

ఏడాదికాలంలో ఏపీకి 39 కొత్త పరిశ్రమలు

మేధోమథన సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్న పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వంగా సపోర్టీవ్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. ఈ ఏడాది కాలంలో రూ.34,322 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. రాష్ట్రంలో 39 భారీ, మధ్య తరహా పరిశ్రమల ఏడాదిలో ఉత్పత్తికి ప్రారంభించడం జరిగిందన్నారు. మేధోమథన సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..

ఏడాది కాలంలో 13,122 కొత్త ఎంఎస్‌ఎంఈ యూనిట్లు కూడా వచ్చాయి. వీటి ద్వారా రూ.2,503 కోట్ల పెట్టుబడులు రాగా.. 63,897 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మధ్య కరోనా విపత్తు వల్ల పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.. రాబోయే రోజుల్లో ఇవన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఉద్యోగాలు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. 

మరో రూ.11,548 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయి. ఏపీఐఐసీ ద్వారా వివిధ పరిశ్రమలకు 1613 ఎకరాల భూమి కేటాయింపు కూడా జరిగింది. మరో ప్రముఖ సంస్థలు కూడా ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. వాటిని ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ కూడా చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 98 వేల యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 10 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారు. వీటిని నిలబెట్టుకోగలిగితేనే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కాకుండా మరో ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం అని చెప్పి.. ఈ ఎంఎస్‌ఎంఈలు బ్యాంకుల్లో లోన్‌లు కూడా కట్టలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని వెంటనే ‘వైయస్‌ఆర్‌ నవోదయం’ పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చి దాదాపు 81 వేల మంది ఎంఎస్‌ఎంఈలకు రూ.2300 కోట్లతో ప్రయోజనం చేకూర్చే విధంగా వాటి పునరుద్ధరణకు బ్యాంకులతో మాట్లాడి ప్యాకేజీలు కూడా తయారు చేసి వారికి తోడుగా నిలబడ్డాం. 

ఇదికాకుండా పారిశ్రామికరంగాన్ని ఆదుకోవడం కోసం మనసుపెట్టి ఆలోచన చేశాం కాబట్టే కోవిడ్‌ సమయంలో మూతపడే స్థితికి వచ్చిన చిన్న చిన్న ఎంఎస్‌ఎంఈలను గాడిలో పెట్టేందుకు రూ.968 కోట్లతో 2014 నుంచి 2019 వరకు పెండింగ్‌లో పెట్టిన ఇండస్ట్రీయల్‌ రాయితీ బకాయిలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. కోవిడ్‌ సమయంలో మన ఆర్థిక ఇబ్బందులు మనకు ఉన్నా.. కూడా మొదటి దఫాగా రూ.450 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చాం. జూన్‌ 29న మిగిలిన బ్యాలెన్స్‌ రూ.500 కోట్లు చెల్లిస్తాం. 

గత ప్రభుత్వం ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని పరిశ్రమల రాయితీలు ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి.. మేము నిజమైన ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు చేయూతను అందించాం. ఇవేకాకుండా ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి రూ.188 కోట్ల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలను రద్దు చేశాం. ఇవేకాకుండా కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరుఫు నుంచి ఎంఎస్‌ఎంఈలకు రూ.12 వందల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని అందించాం. 
 

Back to Top