ఆర్థికశాఖ అధికారులతో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌మీక్ష

అమరావతి : నూతన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఆర్థికశాఖ అధికారులతో సమీక్షా సమావేశం మొదలైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పీవీ రమేష్‌, ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌, అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి పాల్గొన్నారు. 

Back to Top