వైయస్‌ఆర్‌సీపీ నేతల ప్రచారానికి ఆంక్షలు.

వైయస్‌ఆర్‌ జిల్లా: జమ్మలమడుగు మండలం సుగమంచుపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ ప్రచారానికి పోలీసులు ఆంక్షలు విధించారు.  కేవలం మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఇంఛార్జ్‌ సుధీర్‌రెడ్డి సహా మరో ఇద్దరిని మాత్రమే ప్రచారానికి అనుమతిస్తామన్న పోలీసుల తీరుపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు.ఎన్నికల కోడ్‌ వచ్చినా ప్రచారం చేసుకునేందుకు ఆంక్షలు విధించడంపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులతో వైయస్‌ఆర్‌సీపీ నేతల వాగ్వాదం జరిగింది.

వైయస్‌ఆర్‌సీపీలోకి  30 కుటుంబాలు చేరిక

వైయస్‌ఆర్‌సీపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా సుగమంచుపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ నేత రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు పార్టీలోకి చేరారు.వారికి వైయస్‌ అవినాష్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డిలు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు

 

Back to Top