వైయస్జిఆర్ జిల్లా: వైయస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దోషులను కాకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కుటుంబాన్ని సీబీఐ టార్గెట్ చేసిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్ భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ వైయస్ఆర్ జిల్లాలో శాంతియూత ర్యాలీ నిర్వహించారు. సీబీఐ ఏకపక్ష వైఖరి పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.కడప- తాడిపత్రి హైవేపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. సీబీఐ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.