డిప్యూటీ సీఎం, గిరిజ‌న మంత్రిగా రాజన్నదొర బాధ్యతలు

స‌చివాల‌యం: ఏపీ డిప్యూటీ సీఎంగా, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా పీడిక రాజ‌న్న‌దొర బాధ్య‌త‌లు స్వీక‌రించారు. స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం త‌న శాఖ బాధ్య‌త‌లను స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం రాజ‌న్న‌దొర‌కు ప‌లువురు నేత‌లు, అధికారులు అభినంద‌న‌లు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి రాజ‌న్న దొర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గిరిజనుల సంక్షేమానికి కృషిచేస్తానని చెప్పారు. లాభసాటి వ్యవసాయం వైపు గిరిజనులను ప్రోత్సహిస్తాన‌న్నారు. విద్య, వైద్యం గిరిజనులకి అందేలా అన్ని ఐటీడీఎ పరిధిలో ఏరియా ఆసుపత్రులని నిర్మాణం చేస్తున్నామని, ప్రతీ మండలానికి రెండు కళాశాలలు నిర్మిస్తామని చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌పై న‌మ్మ‌కంతో అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తాన‌ని వివ‌రించారు.

Back to Top