సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోడీ శుభాకాంక్ష‌లు

ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రధాన‌మంత్రి నరేంద్ర మోడీ ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం వైయ‌స్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైయ‌స్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్ర‌ధాని మోడీ ట్విట్టర్ చేశారు. అదే విధంగా లోక్‌స‌భ స్పీక‌ర్‌, ప‌లు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజ‌కీయ‌, సినీ ప్రముఖులు, వైయ‌స్ఆర్ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top