వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై పోలీసుల ఆంక్ష‌లు

రైతుల ధర్నాకు వెళ్ల‌కుండా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల నిర్బంధం

విజ‌య‌వాడ‌: దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు దన్నుగా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై పోలీసులు ఆంక్ష‌లు విధిస్తున్నార‌.  అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైయ‌స్ఆర్‌సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందించనున్నారు. కాగా, ఎన్టీఆర్ జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు  అడ్డుకుంటున్నారు.  రైతులకు అండగా నిరసన తెలపకుండా నేతల‌ను అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు వెళ్లకుండా దారిలోనే దేవినేని అవినాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అవినాష్‌ను సిటీలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి చుట్టూ పోలీసుల మోహరించారు. మల్లాది విష్ణు, కార్పొరేటర్లు బయటకు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు విధించారు.

Back to Top