సీఎం వైయ‌స్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

 అమరావతి: గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.    

కాగా, ఆదివారం అర్థరాత్రి  గోపాల్‌పూర్‌-కళింగపట్నం మధ్య గులాబ్‌ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top