అందరినీ కలుపుకుని వెళతా 

 పినిపె విశ్వరూప్  
 

అమ‌రావ‌తి:  జిల్లాలో అంద‌రినీ క‌లుపుకుని వెళ‌తాన‌ని మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న పినిపె విశ్వ‌రూప్ అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్ క్యాబినెట్ కూర్పు అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉందని అన్నారు.  గతంలో తాను మంత్రిగా వ్యవహరించానని, ఆ అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రెండున్నరేళ్లు మంత్రిగా, ఆపై రెండున్నరేళ్లు పార్టీ కోసం పనిచేయాలన్న వైయ‌స్ జగన్ సిద్ధాంతం ఆకట్టుకునేలా ఉందన్నారు. ఏ ప్రభుత్వం చేయని రీతిలో ఎస్సీలు, బీసీలతో పాటు అన్ని వర్గాలకు వైయ‌స్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని విశ్వరూప్ కొనియాడారు. మంత్రిగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అందరినీ కలుపుకుని వెళ్లడంపై దృష్టిపెడతానని స్పష్టం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top