పక్కా స్కెచ్ తోనే బాబు దాడులకు ఉసిగొల్పాడు

పుంగనూరు మీడియాతో  రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అంగళ్లు, పుంగనూరులో ఉద్రిక్తతకు చంద్రబాబే కారణం

దాడులకు బాబే ప్రధాన ముద్దాయి
 
పుంగనూరు టౌన్‌కు వచ్చేదిలేదని రాత్రే మీడియా, పోలీసులకు చెప్పారు 

కానీ, దాడులకుట్రతోనే పుంగనూరుకు రౌడీలు, గుండాల్ని తెచ్చాడు

కార్లలో గన్‌లు పెట్టుకుని టీడీపీ నేతలు రావాల్సిన అవసరమేంటి..? 

చంద్రబాబు ఈ వయసులో ఇంతగా బరితెగిస్తాడా..? 

ముందస్తు సమాచారం లేకుండా ఎలా వస్తారని పోలీసులు అడ్డుకున్నారు

రెచ్చగొట్టి మరీ వాళ్ల కార్యకర్తలతో పోలీసుల్ని బాబు కొట్టించాడు

కర్రలు, రాడ్లతో రక్తమొచ్చేలా కొట్టి.. పోలీసు వాహనాల్ని తగలబెట్టారు

అంగళ్లు, పుంగనూరులో ఏనాడూ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు

చంద్రబాబు రౌడీయిజాన్ని ఊహించి ఉంటే ప్రజలే తిరగబడేవారు

మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

చంద్రబాబు దిగజారి వీధిరౌడీలా మాట్లాడటం అలవాటే.

అతని ప్రవర్తనను ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. 

 మతిస్థిమితం కోల్పోయిన బాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు

 నన్ను తిట్టిన మాటలకు నేనేమీ స్పందించను.. బాబు విజ్ఞతకే వదిలేస్తున్నాను

 మంత్రి  పెద్దిరెడ్డి వెల్లడి

పుంగ‌నూరు: పక్కా స్కెచ్ తోనే చంద్ర‌బాబు దాడులకు ఉసిగొల్పాడ‌ని పుంగనూరు మీడియాతో  రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మండిప‌డ్డారు. పుంగ‌నూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు.   
– అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం, పక్కా స్కెచ్ తో తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో దాడులు చేయించాడు. అంతా వారు ముందే ప్లాన్ చేసుకున్నట్లుగానే ఈ ఘటనకు కారణమయ్యాడు.
– నిన్న రాత్రి 10.30 గంటలకు టీడీపీ నేతలు ఇక్కడ మీడియాకు పుంగనూరు పట్టణానికి చంద్రబాబు రావడం లేదని, బైపాస్‌ మీదుగా వెళ్తున్నామని సమాచారం అందించారు.
– పోలీసులకు కూడా పుంగనూరుకు రావడంలేదనే చెప్పారు. 
– వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు చంద్రబాబు పాలనలో తమకు జరిగిన అన్యాయం పట్ల నిరసన కార్యక్రమం పెట్టుకుని.. ఆయన కోసం ఉదయం 10.30 వరకు ఎదురుచూశారు. కానీ, ఆయన ఇటువైపు రావడంలేదని తెలిసి వారంతా వెళ్లిపోయారు. 
– ఆ తర్వాత చంద్రబాబు పనిగట్టుకుని .. కావాలని రెచ్చగొట్టడానికి పుంగనూరుకు వచ్చాడు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకూడదని పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు.  
– కానీ, ఈరోజు కావాలనే పనిగట్టుకుని ఆలస్యంగా పుంగనూరు వైపు వచ్చి ప్రజలను రెచ్చగొట్టారు. పోలీసులు కూడా సమాచారం లేకుండా ఎలా వస్తారని  అడిగినందుకు వాళ్లను రక్తాలు కారేటట్టు కొట్టారు. 
– పోలీసుల్ని కర్రలతో, రాడ్లతో కొట్టారు. రాళ్లు విసిరి పోలీసుల తలలు పగులకొట్టారు. వారి జీపులు, వాహనాలను కూడా టీడీపీ వారు దాడులు చేసి ధ్వంసం చేసి తగులబెట్టారు.
– పుంగనూరు, అంగళ్లులో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. కిరాయి గుండాల్ని తెచ్చుకుని.. కార్లలో గన్‌లను పెట్టుకుని వచ్చారు. ఆ గన్‌లున్న కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
– ఇలా జరుగుతుందని తెలిసుంటే.. పుంగనూరు, అంగళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండేవారు. కానీ, మేం పుంగనూరుకు రావడంలేదని చెప్పి, ప్రజలను తప్పుదారిపట్టించి.. మరలా ప్లాన్‌ ప్రకారం చంద్రబాబు ఇటు వచ్చారు. 
– పుంగనూరు పుడింగా.. నీ తాత జాగీరా..? అని నన్ను ఏ మాటంటే ఆ మాట అన్నాడు. అయినా.. ఆయన మాటలకు నేనేమీ స్పందించను. చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నాను. 
– చంద్రబాబు పెద్ద శాంతికాముకుడని చెప్పుకోవడం కాదు...మరి, ఇలాంటి ఘటనల్ని రెచ్చగొట్టి చేయించిన వారిని ఏమనాలి..? ఈరోజు ఆయన ప్రదర్శించిన రౌడీయిజంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి. 
– చంద్రబాబు దిగజారి వీధిరౌడీలా మాట్లాడటం అలవాటే. అతని ప్రవర్తనను ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. 
– ఆయనకు మతిస్థిమితం లేదు. విపరీతమైన ఫ్రస్టేషన్‌తో ఊగిపోతూ శాంతిభద్రతల సమస్యల్ని సృష్టిస్తున్నాడు. ఈ వయసులో చంద్రబాబు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయిస్తాడని ఎవరూ అనుకోరు.
– సీనియర్‌ రాజకీయవేత్తనని చెప్పుకుంటూ నోటికి పలకరాని భాష మాట్లాడుతూ మమ్మల్ని బూతులు తిట్టాల్సిన పనేంటి..?  
–చంద్రబాబు ఇంత హింసాత్మక ఘటనలకు ఉసిగొల్పుతాడని అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబును తిరగనిచ్చేవారు కాదు. 
– ఈరోజు ఘటనలను పూర్తిగా చంద్రబాబునే కారకుడు కనుక.. ఈ దాడుల్లో కేసుల్లో ప్రధాన ముద్దాయి చంద్రబాబే. 

Back to Top