విజయవాడ: నిత్యం యోగా సాధన చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని, శారీరక, మానసిక ప్రశాంతత కలుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం విజయవాడలోని ఏపీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మైండ్, బాడీని ఫిట్ గా వుంచేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. యోగసాధన వల్ల కలిగే ప్రయోజనాలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా వుండవచ్చు అన్నారు. శారీరక, మానసిక పటిష్టానికి యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మానసిక స్థితిని సమన్వయం చేయడం, శరీరాన్ని, ఆత్మను యోగా ద్వారా మన ఆదీనంలో వుంచుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.