రేపు ప్రజా సంకల్పయాత్ర విజయోత్సవం..

ఇచ్ఛాపురంలో పైలాన్ ఆవిష్కరించనున్న వైయస్‌ జగన్‌..

భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న జననేత..

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం

శ్రీకాకుళంః టీడీపీ అరాచక శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన  ప్రజలకు వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కృతజ్ఞతలు తెలిపారు.రేపటితో పాదయాత్ర ముగియనుందని ఆయన తెలిపారు.రేపు మధ్యాహ్నం ఇచ్చాపురంలో విజయ సంకల్ప స్థూపాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన అనంతరం బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రి తిరుపతి బయలుదేరి వెళ్తారన్నారు. తిరుమలో కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకుంటారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజలందరూ వైయస్‌ జగన్‌ను అప్యాయంగా అక్కున చేర్చుకుని మద్దతు తెలిపారన్నారు. వైయస్‌ జగన్‌ను  అంతం చేయడానికి టీడీపీ హతాయత్నానికి కూడా తెగబడిందన్నారు. అత్యంత భద్రత కలిగిన ప్రాంతమైన ఎయిర్‌పోర్ట్‌లో వైయస్‌ జగన్‌పై  హత్యాయత్నం జరిగింతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానిదే  బాధ్యత అని  మాది కాదన్నారని, నేడు కేంద్ర దర్యాప్తు బృందానికి సహకరించకుండా రాష్ట్రంలో వారి ప్రమేయం ఏమిటని ప్రశ్నించడం దారుణమన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని కోరారు.

Back to Top