అన్నవరం: కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ యువత తన లక్ష్యం వైపు అడుగులు వేయాలని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. నూతన సంవత్సవం సందర్భంగా అన్నవరం ఆలయంలో బొత్స సత్యనారాయణ దంపతులు ప్రత్యకపూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది స్మృతులను నెమరు వేసుకుంటూ సరికొత్త లక్ష్యాల తో నూతన ఏడాదిలోకి అడుగు పెట్టాలని సూచించారు. ఆ దిశగా లక్ష్యసాధనకు అహర్నిశలు శ్రమిస్తే విజయం మన సొంతమవుతుందన్నారు. చెడుకు దూరంగా మంచిని ఆహ్వానించి ఉన్నత స్థాయి వైపు దృష్టి సారించాలని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. నాయకులను కలిసి పార్టీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.