సెల్ఫీ వీడియో క‌ల‌క‌లం

ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నం

రైతుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శ‌

క‌ర్నూలు: క‌ర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల సెల్ఫీవీడియో క‌ల‌క‌లం రేపింది.  ఆరుగాలం క‌ష్టించి పండించిన ఉల్లి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర లేక‌పోవ‌డంతో మ‌న‌స్థాపంతో రైతులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.  కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గం సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన ఉల్లి రైతులు వెంకటేశ్, నాయుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఐదెకరాలలో పంట సాగు చేయగా మద్దతు ధర లేక నష్టపోయామని, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగు మందు తాగారు. వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. ప్ర‌భుత్వం క్వింటాకు రూ.2000ల మద్దతు ధర కల్పించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. 

Back to Top