వైయస్‌ఆర్‌ సీపీ నుంచి ఒగ్గు గవాస్కర్‌ సస్పెండ్‌ 

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం, 32వ డివిజన్‌కు చెందిన ఒగ్గు గవాస్కర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది. వైయస్‌ఆర్‌ సీపీ నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఒగ్గు గవాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top