నివర్‌ తుపానుపై మంత్రి అనిల్‌ కుమార్‌ సమీక్ష

 నెల్లూరు: నివర్‌ తుపానుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌, ఉన్నతాధికారుల తుపాను సహాయక చర్యలు బాగా తీసుకుంటున్నారని ప్రశంసించారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 700 కుటుంబాలను ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పంట నష్టం పెద్దగా లేకపోవడం అదృష్టం అన్నారు. చెరువుల విషయంలో నీటిపారుదల అధికారులు జాగ్రతగా ఉండాలని.. తీరప్రాంతంలో ఉన్న స్పెషల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాలు, నిత్యావసర లు కు ఇబ్బంది కలగకుండా చూస్తున్నమన్నారు. ఈరోజు, రేపు రెండు రోజులు ప్రజలు సహకరించాలని కోరారు. బయట తిరగకుండ జాగ్రత్తగా ఉండాలని.. చెరువుల దగ్గర ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సూచించారు. 

Back to Top