తాడేపల్లి: బైజూస్ కంటెంట్, ట్యాబులపై రామోజీ రావు ఈనాడు పత్రికలో అశుద్ధమైన రాతలు రాశారని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. పేద విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తే తప్పేంటీ? అని నాగార్జున యాదవ్ సూటీగా ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల మీద రామోజీరావు విషం చిమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ట్యాబులు ఇస్తే.. అశుద్ధమైన రాతలా? బడుగు, బలహీనవర్గాల మీద టీవీ ఎపిసోడ్ ల తరహాలో.. నిత్యం విషం చిమ్ముతున్న ముసలాయన రామోజీ. ఈరోజు ఈనాడు పత్రికలో " బైజూస్ కంటెంట్ తో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చెడిపోతున్నారు, ప్రైవేట్ వీడియోలు, పోర్న్ వీడియోలు చూస్తున్నారు, జగన్ గారు పేద విద్యార్థులకు ట్యాబ్ లు అందించడం వల్ల విద్యార్థులంతా నాశనమైపోతున్నారంటూ..." అశుద్ధమైన, అసత్యమైన వార్తను వండివార్చారు. రామోజీని సూటిగా ప్రశ్నిస్తున్నా... ఎందుకయ్యా..! బడుగు, బలహీన వర్గాలపై మీకు ఇంత అసూయ, ఈర్ష్య, ద్వేషం అని. బడుగుబలహీన వర్గాల పిల్లలకు డిజిటల్ విప్లవంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం... సమర్థమైన పాఠ్యప్రణాళిక రూపొందించి, బైజూస్ కంటెంట్ తో, చదువుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేలా ట్యాబ్ ల పంపిణీ చేస్తే.. ఎందుకంత విషం చిమ్ముతున్నారు రామోజీ...?. మీకు ఏం అన్యాయం చేశామని మా బడుగు,బలహీన వర్గాల మీద ఈ విధంగా విషం చిమ్మి ఈనాడులో అచ్చువేస్తున్నారు..? పెత్తందారుల పిల్లలు ట్యాబులు చూడటం లేదా? రామోజీకి కూడా మనవళ్లు, మనవరాళ్ళు ఉన్నారుకదా..! అలాగే చంద్రబాబుకూ ఒక మనవడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూ కుమారులు, కూతుర్లు ఉన్నారుకదా..! మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్ డ్ ల్యాప్ టాప్ లు, మ్యాక్ బుక్ లు, ఐప్యాడ్ లు, ట్యాబ్ లు వాడుతున్నారు కదా..!. మీ పిల్లలు మాత్రం విజ్ఞానం కోసం ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు వాడుతుంటే.. మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ట్యాబ్ లు వాడి పోర్న్ వీడియోలు చూస్తున్నారని అంటారా?. బడుగు, బలహీన వర్గాల మీద మీకు ఎంత కడుపుమంట? ఎంత ద్వేషంతో విషం కక్కుతున్నారో అర్థమవుతుంది. ఈ విధంగా మీరు ఎంత కుల దురఅహంకారం చూపిస్తున్నారో.., ఎంత కండకావరం ప్రదర్శిస్తున్నారో.. ఇది పెత్తందారీతనం కాదా ముసలాయన రామోజీరావు... అని నిలదీస్తున్నాం. పెత్తందారుల్ని,కులదురహంకారుల్ని తరిమికొట్టే రోజు వస్తుందిః మీకు దీటుగా, మా బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల చేతుల్లో ట్యాబ్ లను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు పెడుతుంటే, మా బిడ్డలు కూడా ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకుంటుంటే.. ద్వేషంతో మీ పెత్తందారుల కళ్ళు మండి, కడుపుమంటతో మా మీద విషపురాతలు రాస్తూ, వింత కూతలు కూస్తున్నారే, మేం మీకు ఏం అన్యాయం చేశాం?. మేం నాలుగు అక్షరాలు నేర్చుకోవాలని, డిజిటల్ విప్లవంలో మేం కూడా ముందుకు వెళ్ళాలని.. గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు చేయి అందిస్తుంటే ఎందుకు మా మీద ద్వేషాన్ని కనబరుస్తున్నారు.. మేము ఏం చేయలేమనా? మేము ఏం సాధించలేమనా? కచ్చితంగా ఒక రోజు వస్తుంది.. ఒక బీసీగా చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలోని కులసంఘాలన్నింటికీ విన్నవిస్తున్నాను. వీళ్ళు చూపిస్తున్న కుల అహంకారాన్ని మీరు గుర్తుచేయండి.. వారి బిడ్డలు మాత్రం ఉన్నతంగా చదువుతుంటే, వారి బిడ్డలు ల్యాప్ టాప్ లు వాడుతుంటే.. ట్యాబులు వాడుతుంటే.. వారికి రాని సమస్య, ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వాడుతుంటే మాత్రమే వస్తుందా? అనే విషయం అందరూ గమనించాలి. ఈ కుల అహంకార జాడ్యాన్ని తరిమికొట్టాల్సిన రోజులు వచ్చాయి. నిత్యం ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తున్న ముసలాయన రామోజీకి నేరుగా చెప్తున్నాం. మిమ్మల్ని, మీలాంటి పెత్తందారుల కుట్రలను, కుతంత్రాలను ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయి. నిరుద్యోగ రేటు తగ్గితే కూడా చెత్తరాతలా? నిరుద్యోగంలో రాష్ట్రం నెంబర్ వన్ అని అత్యంత చండాలమైన వార్త రామోజీ రాశాడు. నిజం రాస్తే జర్నలిజం అంటారు.. అదే అబద్ధం రాస్తే ఏమంటారో రామోజీనే తేల్చుకోవాలి. "నిరుద్యోగంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని.. కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదిక.." అంటూ రామోజీ వంచనతో కూడిన వార్త అచ్చేశాడు. అది ఎంత అసత్యం అంటే.. చంద్రబాబు హయాంలో, చివరి సంవత్సరం అంటే, 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.3శాతం నిరుద్యోగ రేటు ఉంది. అదే జగన్ గారి హయాంలో 4.1శాతంగా ఉందని ఆ నివేదిక సారాంశం. ఆ రిపోర్టు ప్రకారం అంటే సుమారుగా 1.2 శాతం నిరుద్యోగ రేటు జగన్ గారి హయాంలో తగ్గింది. - పట్టభద్రుల్లో 24శాతం నిరుద్యోగత ఉందని కూడా రాశారు.. చంద్రబాబు హయాంలో గ్రాడ్యుయేట్స్ లో 27.1శాతం నిరుద్యోగ రేటుఉంటే, పోస్ట్ గ్రాడ్యూయేట్ లో 22.6శాతం నిరుద్యోగ రేటు ఉంది. ఇంత స్పష్టంగా చంద్రబాబు హయాంలో నిరుద్యోగ రేటు అత్యంత దారుణంగా ఉందని చెబుతూ .. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ రేటు తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. 2018లో 5.3శాతం ఉన్న నిరుద్యోగ రేటు 2022-23కి వచ్చేసరికి 4.1శాతంకు తగ్గింది. అంటే నిరుద్యోగ రేటు పెరిగిందా.. తగ్గిందా రామోజీ..? ఇటువంటి అభాసుపాలయ్యే వార్తలు రాసి, అబద్ధాలను వండి వార్చి, వాటినే టీడీపీ ప్రెస్ మీట్లు పెట్టి, పచ్చ మేధావులతో చర్చలు పెట్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్ గారు ఇచ్చిన 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ.. బాబు ఇచ్చిన 34 వేలు ఎక్కడ..? గౌరవ ముఖ్యంత్రి జగన్ గారు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలనే ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటివరకు 6,16,323 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వీటిలో పర్మినెంట్ ఉద్యోగాలు-2.10 లక్షలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు-3,71,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు-37,908. చంద్రబాబు ఐదేళ్ళ పాలనా కాలంలో కేవలం 34,108 ఉద్యోగాలు ఇస్తే.. జగన్ గారు ఇప్పటివరకు 6,16,323 ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ ఉద్యోగాలు జగన్ గారు కల్పించారు. ముసలాయన రామోజీని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు వేలల్లో ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ రేటు తగ్గిందని, జగన్ గారు లక్షల్లో ఇస్తే నిరుద్యోగ రేటు పెరిగిందని చెత్త రాతలు రాయటానికి సిగ్గు ఎక్కడ లేదు అని. జగన్ గారి హయాంలో దాదాపుగా 6,16,323 ఉద్యోగాల కల్పన జరిగితే నిరుద్యోగ రేటు తగ్గుతుందా? పెరుగుతుందా?. రామోజీకి కనీసం ఇంగితజ్ఞానం ఉంటే నిరుద్యోగ రేటు పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది తెలుస్తుంది. మీకు ఇంగిత జ్ఞానం లేదు. చంద్రబాబు హయాంలో 34,108 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే.. తమకు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. మీ పెత్తందారి వర్గాలు అందరూ కలిసి.. బడుగుబలహీనవర్గాలకు జగన్ గారు చేస్తున్న సేవను చూసి కన్నుకుట్టి, కడుపుమంటలో వీరిని ఎలాగైనా తొక్కి, వెనక్కినెట్టేయాలన్న దురహంకారంతో, కుల అహంకారతో ఆలోచనలు చేస్తూ జగన్ గారి ప్రభుత్వం మీద చేస్తున్న విష ప్రచారాన్ని అందరూ ఖండించాలి. విద్యార్థులందరూ, బడుగుబలహీన వర్గాల ప్రజలందరూ కచ్చితంగా ముసలాయన రామోజీ చేస్తున్న విషప్రచారాన్ని, వింతకూతల్ని, చెత్తరాతల్ని పట్టించుకోకుండా తగిన సమాధానం చెప్పాలి. అవినీతి,నిరుద్యోగంలో నెంబర్ వన్ చంద్రబాబు పాలనః అలాగే మా ప్రభుత్వ హయాంలో అవినీతి జరుగుతుందని నిత్యం పనిగట్టుకుని రామోజీ, ఎల్లో మీడియా విషం కక్కుతుంది. 2016-17లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ సీఏఈఆర్, సీఎంఎస్ ఇండియా కరెప్షన్ స్టడీ-2017 నివేదికల ప్రకారం, చంద్రబాబు ప్రభుత్వంలో 74.3 శాతం అవినీతి ఉంది. అప్పట్లో దేశంలోనే అత్యంత అవినీతితో కూడుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం,అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి కార్యక్రమాల్ని చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా చేశారని నిరూపితమైంది. గత చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్.. అన్ని సర్వే సంస్థలూ వివరించాయి. ముసలాయన రామోజీకి సవాల్...! రామోజీరావుకు సవాల్ విసురుతున్నాం.. సుమారుగా 5.50లక్షల ట్యాబ్ లను ముఖ్యమంత్రి జగన్ గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఇచ్చారు. దీనిపై రామోజీని బహిరంగ చర్చకు రమ్మనండి. ఏ విద్యార్థులు ఎటువంటి వీడియోలు చూస్తున్నారు, ఏ విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనకు కాకుండా వేరే వాటికి వాడుకున్నారో రామోజీ చెప్పాలి. తమ మనవళ్ళందరికీ ట్యాబ్ సౌకర్యం ఉందోలేదో రామోజీనే సమాధానం చెప్పాలి. కేవలం జగన్ గారు మీద విష ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు తప్ప, వీటిల్లో ఎటువంటి వాస్తవం లేదు. పెత్తందారీ పోకడలతో మన జీవితాలను నాశనం చేస్తున్న పెత్తందారులకు సరైన సమయంలో బడుగు, బలహీనవర్గాల వారంతా తగిన బుద్ధి చెప్పాలి.