అమరావతి: మున్సిపల్ ఎన్నికల చరిత్రలో వైయస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ దూసుకుపోతుంది. అన్ని జిల్లాల్లోనూ వైయస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన సోదిలో లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ‘ఫ్యాన్’ హవా కొనసాగుతోంది. పట్టణాలు, నగరాల్లో ఓటెత్తి అధికార వైయస్సార్ సీపీకి జనం జైకొట్టడంతో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి పట్టం ఇదే తొలిసారి. ఇక సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక ‘ఫ్యాన్’ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉనికి చాటలేక చతికిలపడ్డాయి. ఇక టీడీపీ సీనియర్ నేతల జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు(విజయనగరం), తునిలో యనమల రామకృష్ణుడికి, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు, హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సానుకూల దృక్పథంతో, సంక్షేమ పథకాలతో తమ హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే మరోసారి ప్రజలు పట్టం కట్టడంతో సరికొత్త రికార్డు దిశగా వైయస్సార్ సీపీ దూసుకుపోతోంది. కాగా ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు తదితర 6 కార్పొరేషన్లను కైవసం చేసుకున్న వైయస్సార్‌సీపీ... విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ ఆధిక్యం కనబరుస్తోంది. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ముందంజలో ఉంది. దీంతో వైయస్సార్ సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ►టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొడుతూ.. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్స్ విజయ ఢంకా మోగించింది. అదే విధంగా మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం.. చిత్తూరు జిల్లాలో వైయస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. టీడీపీ కోటలు బద్ధలయ్యాయి. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీ ఘన విజయం సాధించింది. వైయస్సార్‌సీపీ విజయఢంకా విజయవాడ: మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల మొదటిరౌండ్‌లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. 23 డివిజన్ల లో 18 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. 5 డివిజన్లకు మాత్రమే టీడీపీ పరిమితం కాగా, గ్లాస్ బోణి కొట్టలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ కు చేదు అనుభవం అనంతపురం: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో 20 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా, నాలుగు వార్డులకే టీడీపీ పరిమితమైంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి కృష్ణా జిల్లా: మచిలీపట్నం కార్పొరేషన్‌లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థి బొడ్డు నాగలక్ష్మి పై వైసీపీ అభ్యర్థిని కొలుసు విజయగంగ విజయం సాధించారు. ధర్మవరంలో వైయస్సార్‌సీపీ క్లీన్ స్వీప్.. అనంతపురం: ధర్మవరంలో వైయస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. వైయస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 40 వార్డుల్లో పది వార్డులు ఏకగ్రీవం కాగా, 30 వార్డుల్లో ఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట దౌర్జన్యం అనంతపురం: కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దౌర్జన్యానికి దిగారు. అక్రమంగా కౌంటింగ్ కేంద్రంలో చొచ్చుకువెళ్లారు. 29వ వార్డులో ఆరు ఓట్లతో గెలిచిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా కందికుంట.. అడ్డుకున్నారు. కందికుంట దౌర్జనానికి నిరసనగా ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి బైఠాయించారు. అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ విశాఖ: నర్సీపట్నం లో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ తగిలింది. నర్సీపట్నం మున్సిపాలిటీని వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను 16 వార్డుల్లో వైయస్ఆర్ సీపీ విజయం సాధించింది. ►కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ తొలి రౌండ్ ఫలితాల్లో వైయస్ఆర్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. 20 వార్డులకు గాను తొలి రౌండ్‌లో ఆరు వార్డును కైవసం చేసుకుంది. పశ్చిమలో వైయస్ఆర్ సీపీ హవా.. పశ్చిమగోదావరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ హవా కొనసాగుతుంది. జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలు వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అభినందించారు. ►నెల్లూరు: సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు ఇప్పటి వరకు 24 చోట్ల వైయస్ఆర్ సీపీ గెలుపు సాధించింది. ►తూర్పుగోదావరి: గొల్లప్రోలు నగర పంచాయతీ వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 12చోట్ల వైయస్ఆర్ సీపీ గెలుపు ►శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ వైయస్ఆర్ సీపీ పీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీలు వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. ►నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్ సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డుల్లో 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►విజయవాడ కార్పొరేషన్‌లో వెలువడిన తొలి ఫలితం. 37వ డివిజన్‌లో వైయస్ఆర్ సీపీ అభ్యర్ధి గెలుపు. ►పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 29 వార్డులకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. ►గుంటూరు: చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 38 వార్డులకు ఇప్పటి వరకు 21 చోట్ల వైయస్ఆర్ సీపీ గెలుపు ►విజయనగరం: బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 8 వార్డుల్లో వైయస్ఆర్ సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు కైవసం. పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి మున్సిపాలిటీలు వైయస్ఆర్ సీపీ కైవసం కర్నూలు కార్పొరేషన్‌ను వైయస్ఆర్ సీపీ సొంతం చేసుకుంది. ►గుంటూరు కార్పొరేషన్‌ను వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. ►అనంతపురం: పుటపర్తి మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం. 20 వార్డులకు 14 చోట్ల వైయస్ఆర్ సీపీ విజయం ►కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం. 27 వార్డులకు 22 చోట్ల వైయస్ఆర్ సీపీ గెలుపు ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైయస్ఆర్ సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైయస్ఆర్ సీపీ విజయం ►అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ పీ కైవసం. 32 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైయస్ఆర్ సీపీ గెలుపు ►కడప: బద్వేల్ మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం ►తిరుపతి కార్పొరేషన్ వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లలో ఇప్పటి వరకు 30 చోట్ల వైయస్ఆర్ సీపీ విజయం సాధించింది. ►గుంటూరు: తెనాలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 5 వార్డుల్లో వైయస్ఆర్ సీపీ విజయం ►కృష్ణా: తిరువూరు 9వ వార్డులో వైయస్ఆర్ సీపీ విజయం ►తూర్పుగోదావరి: రామచంద్రపురం మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం. 28 వార్డులకు ఇప్పటి వరకు 15 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు. ముమ్మిడివరం నగరపంచాయతీ వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►పశ్చిమగోదావరి: నరసాపురం మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం. 31 వార్డులకు ఇప్పటి వరకు 16 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది. ►ఉయ్యూరులో ఇప్పటి వరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు జిల్లాలో వైయస్ఆర్ సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు ఫ్యాన్‌కే పట్టం కట్టారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది. ►గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం ►నగరి మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం ►నగరిలో 29 వార్డులకు 15 వార్డుల్లో వైయస్ఆర్ సీపీ విజయం ►గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం ►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైయస్ఆర్ సీపీ విజయం ►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైయస్ఆర్ సీపీ విజయం ►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైయస్ఆర్ సీపీ విజయం ►ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైయస్ఆర్ సీపీ విజయం ►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం ►గుంటూరు: సత్తెనపల్లి మున్సిపాలిటీ వైయస్ఆర్ సీపీ కైవసం ►28 వార్డులకు ఇప్పటి వరకు 26 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కడప: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్. 20 వార్డులకు 20 చోట్లా వైఎస్ఆర్‌సీపీ గెలుపు ►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డులకు గాను ఇప్పటి వరకు 23 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఆదోని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►42 వార్డులకుగాను ఇప్పటివరకు 22 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►నందిగామ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్ ►కృష్ణా: ఉయ్యూరు 5 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►తిరుపతి: 15, 20, 26, 32, డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►గుంటూరు కార్పొరేషన్‌లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం ►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 6, 13, 24 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇప్పటివరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం. 1, 5, 9, 13, 14, 17, 21, 25, 29 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►కృష్ణా: పెడనలో 23 వార్డులకు గాను 8చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం. 1, 2, 3, 4, 5,. 6, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►విశాఖ: యలమంచిలి 5, 6, 11, 13, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►శ్రీకాకుళం: పలాస మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 31 వార్డులకుగాను ఇప్పటివరకు 16 చోట్ల గెలుపు ►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 19వార్డులకుగాను ఇప్పటివరకు 11చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 30 వార్డులకుగాను ఇప్పటివరకు 18చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►గుంటూరు కార్పొరేషన్‌లో 25 డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధిక్యం ►వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 20వార్డులకు గాను ఇప్పటివరకు 17చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►అనంతపురం: మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►25 వార్డులకుగాను 11చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు ►ఇప్పటివరకు 33 మున్సిపాలిటీలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం ►తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంది. 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైఎస్‌ఆర్ సీపీ గెలుపొందింది. మరోసారి యనమలకు ఎదురుదెబ్బ తగిలింది. మండపేటలో 1, 2, 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►అనంతపురం: మడకశిరలో 2, 3, 7, 10 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది ►వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్లలో 11, 14 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►కృష్ణా: ఉయ్యూరు 8వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం ►నెల్లిమర్లలో ఇప్పటివరకు 6 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం ►2, 3. 4, 5, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం ►24 డివిజన్లకుగాను 21 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం ►అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్ హవా ►నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్‌స్వీప్. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ ►నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైఎస్ఆర్‌సీపీ గెలుపు ►చిత్తూరు: మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ►గుంటూరు కార్పొరేషన్ 34 డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వినుకొండ మున్సిపాలిటీ 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ గెలిచింది. ►విజయనగరం: సాలూరు 4, 5, 6, 7 వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. పార్వతీపురం 12, 13 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది. ►శ్రీకాకుళం: పలాస 6, 9, 15, 16 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇచ్చాపురం 1, 6, 7 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యత కొనసాగుతుంది. 50 డివిజన్లకు గాను 37 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ►కదిరి 30వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 970 ఓట్లతో గులాబ్ జాన్ గెలుపొందారు. ►ఆత్మకూరు మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ►కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది. ►పశ్చిమగోదావరి: నరసాపురం 23వ వార్డులో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. నిడదవోలు 6వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ►కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ‘కనిగిరి’లో వైయస్ఆర్ సీపీ క్లీన్‌స్వీప్ కనిగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ సత్తాచాటింది. 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది ‘గిద్దలూరు’ వైయస్ఆర్ సీపీ కైవసం ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైయస్ఆర్ సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో ముందంజలో ఉంది.