పార్లమెంట్‌లో వైయ‌స్ఆర్‌సీపీకి రూమ్ నం.12 కేటాయింపు..  

పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి   

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక కార్యాలయం కేటాయింపు జరిగింది. లోక్‌సభ కార్యనిర్వాహక అధికారి మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పార్లమెంట్ మొదటి అంతస్తులోని రూమ్ నంబర్–12ను వైయ‌స్ఆర్‌సీపీకి కేటాయించారు. త్వరితగతిన పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బుధ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక పూజ‌లు చేసి ప్రారంభించారు.  

ఎల్లో మీడియా విషప్రచారానికి చెక్
ఇదిలా ఉండగా, రూమ్ నంబర్–11ను కేటాయించారంటూ, దానిపై అసంతృప్తితో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిశారంటూ కొన్ని ఎల్లో మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. వాస్తవానికి, రూమ్ నంబర్–12ను కేటాయించాలని వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీలు వైయ‌స్ అవినాష్ రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణిలు కొద్దిరోజుల క్రితమే స్పీకర్ ఓం బిర్లాను కలిసి అభ్యర్థించారు. ఎంపీల అభ్యర్థన మేరకు స్పీకర్ ఆదేశాలు జారీ చేయడంతో రూమ్ నంబర్–12ను అధికారికంగా వైయ‌స్ఆర్‌సీపీకి కేటాయించారు. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ఎల్లో మీడియా 11వ నంబర్ గదిని అంటగడుతూ విషప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. మొత్తానికి,వైయ‌స్ఆర్‌సీపీకి సరైన గది కేటాయింపు జరిగిందని స్పష్టమవుతుండగా, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
 

Back to Top