ఈవీఎంల‌పై అనుమానం ఉంద‌ని మొద‌టి నుంచి చెప్తున్నాం

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

తాడేప‌ల్లి:  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌పై తమ‌కు మొద‌టి నుంచి అనుమానం ఉంద‌ని చెప్తున్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈవీఎంల‌పై గ‌తంలో చంద్ర‌బాబు అనుమానం వ్య‌క్తం చేశార‌ని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. 2019లో టీడీపీ ఓట‌మి త‌రువాత ఈవీఎంల‌పై చంద్ర‌బాబు మాట్లాడార‌న్నారు. ఈవీఎంల‌పై మేం న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించామ‌ని, కోర్టులో న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కం ఉంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవ‌రు పూర్తి చేశార‌న్నేది ప్ర‌జ‌ల‌కు తెలుసు అన్నారు. వెలిగొండ‌పై ప్ర‌భుత్వం దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేస్తుంద‌ని వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు.

Back to Top