18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలా?

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్‌ 
 

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని విమర్శించారు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని ఇప్పుడు సుమతి శతకాలు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు. 40 ఏళ్లుగా చంద్రబాబు దోచుకుంటూనే ఉన్నారని... దాన్ని ప్రజలు గుర్తించబట్టే పీకేసి, తరిమికొట్టారని చెప్పారు. అయినా నిప్పు, తుప్పు అంటూ రంకెలేస్తున్నారని అన్నారు.

ప్రజలు తుపుక్కున ఉమ్మేసి ఆరు నెలలు కూడా గడవలేదని... కానీ, పరాజితులంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. చూసే వాళ్లకు అసహ్యం వేస్తున్నా, వీళ్లకు మాత్రం సిగ్గనిపించడం లేదని అన్నారు. వీళ్లకు పచ్చ మీడియా ప్రచారం దొరుకుతుందేమో కానీ, మరో పదేళ్లయినా ప్రజాభిమానాన్ని సంపాదించుకోలేరని చెప్పారు.
 

Read Also: నీ దూకుడు.. సాటెవ్వ‌రు

Back to Top