వ్య‌వ‌సాయంలో డ్రోన్ల వినియోగం దేశంలోనే వినూత్న ప్రయత్నం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రవేశపెడుతూ సీఎం వైయ‌స్ జగన్ గారి ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో 10 వేల డ్రోన్లు వాడుకలోకి వస్తాయి. పెస్టిసైడ్లు, ఎరువులు, విత్తనాలు డ్రోన్లతో చల్లడం వల్ల సేద్యం ఖర్చు తగ్గుతుంది. 20 వేల మంది డ్రోన్ పైలట్లుగా ఉపాధి పొందుతారు. దేశంలోనే వినూత్న ప్రయత్నం ఆంధ్రప్ర‌దేశ్‌లో జ‌రుగుతుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

సీఎం వైయ‌స్‌ జగన్ గారి నాయకత్వంలో ఏపీ పోలీసు శాఖ ఉత్తమ పనితీరుతో తమ ప్రతిభను చాటుకుంటూనే ఉంది. స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 56 అవార్డుల్లో ఏకంగా 23 అవార్డులు ఏపీ పోలీసు శాఖ కైవసం చేసుకుంది. తన మొదటి ర్యాంకును అలాగే నిలబెట్టుకుంది. ఈ సందర్భంగా ఏపీ పోలీసు శాఖకు నా ప్రత్యేక అభినందనలు అంటూ విజ‌య‌సాయిరెడ్డి అంత‌కుముందు మ‌రో ట్వీట్ చేశారు.

 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top