'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:   చంద్ర‌బాబు కోవ‌ర్టుల తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. చంద్రబాబు గారు బిజెపిలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టిడిపి భజన చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టిడిపి జిల్లా నాయకులను పురందేశ్వరి గారి సలహా మేరకు రాష్ట్ర బిజెపి నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది. 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

పున్న‌మ్మా..ఇది అన్యాయం అనిపించ‌డం లేదా?
మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు గారు,  కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు. 1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు. పున్నమ్మా! దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top