తాడేపల్లి: కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే బదులు ఎవరికివారే ప్రజాక్షేత్రంలోకి వెళితే ఎవరి బలమెంతో మరింత స్పష్టంగా తెలిసిపోతుందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ ముసుగులో గుద్దులాటలు, పచ్చ మీడియాలో రాతల మర్మం ఏంటో ప్రజలకు తెలియంది కాదు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విపక్ష టీడీపీ నాయకులకు పల్లకీ మోయని వారందర్నీ శత్రువులుగా చూస్తే ఐదు కోట్ల ఆంధ్రులు మీకు శత్రువులే అవుతారు. రాష్ట్రంలో మీకు మిత్రులే లేకుండాపోతారు మహాశయా! అంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.