చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందే!

ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ 
 

 అమరావతి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కేవలం 3 నెలలు మాత్రమేనని, ఇప్పటికే ఇంతలా బట్టలు చించుకుంటున్న చంద్రబాబు మిగిలిన ఐదేళ్లు ఎలా తట్టుకుంటారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఏదేమైనా చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనని సెటైర్ వేశారు. తిరుమలపై ఆర్టీసీ టికెట్ల ద్వారా అన్యమత ప్రచారం జరుగుతోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలను ఖండించారు.  తిరుమల ఆర్టీసి టికెట్ల వెనక మైనారిటీలను జెరూసలేం, మక్కాలకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను టీడీపీ హయాంలోనే ముద్రించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఏమీ తెలియనట్లు అన్యమత ప్రచారం అని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
 

Back to Top