మావాళ్లంతా ప్ర‌జాహిత య‌జ్ఞంలో తీరిక‌లేకుండా ఉన్నారు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విజ‌య‌వాడ‌: చ‌ంద్ర‌బాబు కుట్ర‌లు, కుతంత్రాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఖండించారు. ఇళ్ల పట్టాల పంపిణీతో సంక్రాంతి ముందే వచ్చిందని ఆడపడుచులు ఆనందపడుతుంటే వారి దృష్టి మళ్లించే కుట్రలు మొదలు పెట్టాడు బాబు. ఇవన్నీ పాతకాలం నాటి చీప్ ట్రిక్స్. మీ అరుపులు, పెడబొబ్బలకు బదులిచ్చేంత తీరిక లేదెవరికీ. ప్రజాహిత యజ్ఞంలో తీరిక లేకుండా ఉన్నారు మావాళ్లంతా అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

రుణగ్రస్తుల్ని చేసింది ఎవరు బాబూ?
టిడ్కో ఫ్లాట్ల నిర్మాణ వ్యయాన్ని పెంచి దోచుకున్నది కాక లబ్దిదారులు 20 ఏళ్ల పాటు రూ.7 లక్షలు చెల్లించేలా రుణగ్రస్తుల్ని చేసింది ఎవరు బాబూ? సెంటు భూమిలో ఇల్లు ఎలా కడతారని శోకాలు పెడుతున్నావు. స్థలం ఇచ్చి, ఉచితంగా ఇళ్లు  కట్టిస్తామని సిఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు అంటుంటే  రగిలిపోతున్నావు కదా! అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top