కేసులు, జైలు శిక్షలకు వైయ‌స్ఆర్‌సీపీ బెదరదు

అంబటికి జైల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతల పరామర్శమాజీ మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ స్పష్టీకరణ

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబును ములాఖత్ తో పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 

అంబటిని జైల్లో పెట్టి ఏం సాధించారు ?

మీ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకోవడం తప్ప

జైళ్లలో పెట్టి నేతల్ని బెదిరించలేరు

మీ ప్రతీ తప్పును ఎండగడుతూనే ఉంటాం

తేల్చిచెప్పిన మాజీ మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ 

రాజమహేంద్రవరం:    అంబటి రాంబాబు బయట ఎలా ఉంటారో, జైల్లో కూడా అంతే హుషారుగా ఉన్నార‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. ఆయన ఇంటిపై దాడులు చేసి వీరంగం చేసిన వాళ్లమీద కేసుల్లోవు. ఆయన ఓ మాట అని, దానికీ పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పినా సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇంత దుర్మార్గ పాలన చంద్రబాబు చేస్తారని మాతో పాటు టీడీపీ వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఫ్రస్టేషన్ లో చంద్రబాబు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నట్లుంది. సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, పరిణితి కలిసిన నాయకుడు, గతంలో రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేని అంబటి రాంబాబును ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధించారు?, ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కొన్నిసామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా మారుతోంది. గతంలో అధికారంలో ఉండగా ముద్రగడ పద్మనాభం గారెని కూడా ఇలాగే వేధించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ను అరాచక పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో బీజేపీని కూడా భాగస్వామిని చేయాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టింది రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాల కోసమా లేక రాజకీయాల కోసమా చెప్పాలి. 

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఫొటోకి రక్తతిలకం పెట్టారని ఓ కేసు పెట్టారు, కోడిని కోసినా, మేకను కోసినా కేసులు పెడుతున్నారు. మీరు ఏదీ చెప్పుకోలేక ఫెయిలయ్యారు కాబట్టే లడ్డూను పట్టుకుని వేలాడుతున్నారు. తిరుపతి ప్రసాదం వేరుతో వేంకటేశ్వరస్వామి కీర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి చేసిన తప్పేంటి ?, టీడీపీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీని పోలీసులు తొలగించాల్సింది పోయి, మహిళా నేతలు సైతం ఆయనపై, ఆయన ఇంటిపై దాడులకు వస్తుంటే, కేంద్రమంత్రి సినిమా చూపిస్తామని బెదిరింపులకు దిగడాన్ని ఎలా అర్దంచేసుకోవాలి. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మీకు అసలైన సినిమా చూపిస్తుంది. అంబటి రాంబాబును జైల్లో పెడితే వైయ‌స్ఆర్‌సీపీబెదిరిపోతుందని అనుకోవద్దు. తప్పు చేసి జైలుకెళ్తే బాధపడాలి కానీ వాళ్లు తప్పుచేసి జైలుకు పంపారు కాబట్టి ఎలాంటి బాధా లేదని అంబటి ఇవాళ చెప్పారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సాధారణ కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి నాయకుల వరకూ జైలుకెళ్లడానికి సిద్దంగా ఉండాలని మెసేజ్ ఇస్తున్నారు. అవును మేం సిద్దంగానే ఉన్నాం. మీ ప్రతీ తప్పును ఎండగడతాం, ఏదో ఒక రోజు వేంకటేశ్వర స్వామి విధించే శిక్షకు సిద్దంగా ఉండండి. ఇప్పటికైనా వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను కాపాడాలని కోరుతున్నాం. 

● చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ..

తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ మా వాళ్లు ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్నారని చెప్పారు.  వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న ఎమ్మెల్యేతో స్వామి వారే నిజం చెప్పించారు. ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్లి లడ్డూలో నెయ్యి కల్తీ చేయమని చెప్తాడా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ రెండోరోజు మాట మార్చారు. సబ్జెక్ట్ లేనప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తప్పు చేశారని చెప్పాలనుకున్నాడు, కానీ స్వామి వారు ఆయన గతంలో ఏం చేశాడో బయటపెట్టిస్తున్నారు. శ్రీవారే తిరుపతి ఎమ్మెల్యేతో నిజం చెప్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అపచారాలను వాళ్ల ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారనే విషయం గుర్తుంచుకోవాలని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు.

Back to Top