రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టాలి

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: కరోనా నియంత్రణకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞాపనలు విని ఇళ్ల నుంచి బయటకు రాకుండా సహనం ప్రదర్శించాలని, అతి తక్కువ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రంగా మన గౌరవాన్ని నిలబెట్టాలని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు.  ప్రజలంతా సామాజిక దూరం పాటించగలిగితే కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలతో అవసరమే లేదు. సీఎం వైయస్‌ జగన్, అధికారుల విజ్ఞాపనలు విని లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా సహనం ప్రదర్శించాలి. దేశంలోనే అతి తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రంగా మన గౌరవాన్ని నిలబెట్టాలి. 
 

Back to Top