విజయవాడ: ప‌్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. నీతి, న్యాయం, సిగ్గు, లజ్జలను గాలికొదిలిన వ్యక్తి ధర్మ పరిక్రమ యాత్ర అంటూ పిలుపునివ్వడం దిగజారుడుకు పరాకాష్ట. జనం ఉమ్మేస్తారన్న భయం కూడా లేకుండా దబాయింపులకు దిగుతున్నాడు. గుళ్లను కూల్చి, దేవతా మూర్తులను అపవిత్రం చేస్తూ ధర్మం గురించి సుద్దులు చెప్పడం ఇంకెవరి వల్లా కాదు బాబూ..అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయం అనేది క్షణంలో కలిగేది కాదు. ప్రతి మెట్టు అవసరమే. ఒకే అడుగుతో కలిగే విజయం తాత్కాలికం మాత్రమే...అంటూ అంతకు ముందు చేసిన ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.