విశాఖ: ప‌్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. వైజాగ్ లో ప్రమాదవశాత్తు కింద పడిన పోలీసు అధికారిని లేపి సాయపడుతున్న యువకుడిని అతనిపై దాడి చేస్తున్న గూండాగా అభివర్ణించడం మతి భ్రమించిన చంద్రబాబుకే సాధ్యం. బురద జల్లేస్తే వాళ్లే తుడుచుకోలేక చస్తారు అనే శాడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబుది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.