ఇప్పుడు వేరే రాష్ట్రాల వారు మన దగ్గరకు వస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  రైతు భరోసా పథకం అద్భుతమని కేరళ ప్రభుత్వం ప్రశంసించింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  ఏపీ విధానాలు స్టడీ చేయమని వ్యవసాయ మంత్రిని పంపింది. గ్రామాల్లో ఆర్‌బీకే  పనితీరును అన్ని రాష్ట్రాలూ స్టడీ చేస్తున్నాయి. సాగుపై అధ్యయనానికి ఒకప్పుడు మన అధికారులు వేరే రాష్ట్రాలు వెళ్లేవారు. ఇప్పుడు వారే మన దగ్గరకు వస్తున్నార‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

స‌కాలంలో విత్త‌నాలు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా..
 దేశంలో తొలిసారిగా శ్రీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన విత్తన విధానాన్ని (సీడ్‌ పాలసీ) తీసుకొచ్చింది. భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని సకాలంలో రైతులకు అందజేయడమే ఈ విధానం లక్ష్యమ‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 
ఏపీలో పైసా ఖర్చులేకుండా నాణ్యమైన విద్య. క్యూబా మాదిరిగా వైద్యరంగంలో విప్లవం. ఫామిలీ డాక్టరు కాన్సెప్ట్. రైతులకు సర్వం సమకూర్చుతూ UNO దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు. సగానికి పైగా పదవులతో మహిళా సాధికారత.  పేదలకు 31లక్షల ఇళ్లు. ఓర్వలేని విపక్షాలు అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top