రాష్ట్రానికి పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశ్వ‌స‌నీయ‌తే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయ‌ని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. వందల కోట్ల దుబారాతో పార్టనర్ షిప్ సమ్మిట్ లు, దావొస్ లో రోడ్ షోలు, ప్రచార ఆర్భాటాలు లేవు. వైయ‌స్ జ‌గ‌న్ గారి విశ్వసనీయతే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలి  వస్తున్నాయి. ఇకపై ఉపాధి కోసం యువత బయటకు వెళ్లే అవసరమే ఉండదు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈ రహస్యమైనా బయటకు చెప్పొచ్చు గదా బాబూ!
ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణాలు బాబు ‘రాడార్’కు ఇంకా అందకపోవడం విచిత్రమే. జరగబోయే ప్రతిదీ తనకు తెలుసంటాడు. దానికి విరుగుళ్లు, వ్యాక్సిన్లు తన సలహా ప్రకారమే తయారవుతాయంటాడు. ‘కాగ్’ వాతలు మీకు ఎలాగూ నొప్పి అనిపించవు. ఈ రహస్యమైనా బయటకు చెప్పొచ్చు గదా బాబూ అంటూ అంత‌కు ముందు ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top