తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అప్రమత్తత వల్ల అతి తక్కువ ప్రాణనష్టం నమోదైన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచి రక్షించాయని ట్విటర్‌లో తెలిపారు. వాలంటీర్లు మూడుసార్లు ఇంటింటి సర్వే చేసి పౌరుల ఆరోగ్య చరిత్రను రికార్డు చేయడం గర్వించదగ్గ విషయమని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి కొనియాడారు. సీఎం వైయస్ జగన్‌ను చూసి నేర్చుకోవాలి పాలనా దక్షత అంటే ఏంటో సీఎం వైయస్ జగన్‌ని చూసి నేర్చుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. సీఎం వైయస్ జగన్ కరోనా నియంత్రణకు అందరి సలహాలు తీసుకుంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తారు. వాటిని అమలు చేసే స్వేచ్ఛ అధికారులకిచ్చారు. పని జరగాలంతే. మీడియా ప్రచారం ఆయన అస్సలు కోరుకోరు. రాష్ట్రం బాగుంటే చాలని కోరుకుంటారు యువ సీఎం వైయస్ జగన్ అంటూ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా విజయసాయిరెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.