చివరకు న్యాయం గెలిచింది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యంపై హైకోర్టు స‌రైన తీర్పు ఇచ్చింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. గేదెకు లేని బాధ గుంజకెందుకో? అన్నట్టుంది నిమ్మగడ్డ వ్యవహారం. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున ఎన్నికల విధులు నిర్వహించలేమని ఉద్యోగులు మొరపెట్టుకున్నా ససేమిరా అన్నాడు. చివరకు న్యాయం గెలిచింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ కూ ఆటంకాలు తొలిగిపోయాయి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ట‌ర్లో పేర్కొన్నారు.

కరోనా భయంతో ముక్కుకి గుడ్డ కట్టుకొని హైదరాబాద్‌లో దాక్కున్నారు పెద్ద/చిన్న నాయుడు. 60 నుంచి వందేళ్ల వృద్ధులు కూడా పంచాయితీ ఎన్నికల్లో ఓటేయాలని అంటున్నారు. టీడీపీ బతకదని తెల్సు కాబట్టి ఏపీ ప్రజలు ఏమైనా పర్వాలేదనుకుంటున్నారు. వీళ్లు మనుషులా, రాక్షసులా? అంటూ అంత‌కుముందు ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top