ఏది విజన్ ? ఏది దుబారా ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో త‌న ప‌బ్లిసిటీ కోసం ప్ర‌జాధ‌నాన్ని దుబారా చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'పోలవరం యాత్రలకు చంద్రబాబు  చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ  దీక్షలకు  మరో 300 కోట్లు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్లు. ఏది విజన్ ? ఏది దుబారా ?' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. 

వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? 
  మరో ట్వీట్‌లో.. 'రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా. మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు  జగన్ గారు బంగారు బాటలు వేస్తున్నారు. తేడా తెలుస్తోందా?' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top