టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండేళ్ల పాల‌న‌పై కామెంట్ చేసిన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. రెండేళ్లలో  వైయ‌స్ జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయని విజ‌య‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా16 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒకే రోజు శంకుస్థాపన చేశార‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top